సౌతాఫ్రికా పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20ల చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. 259 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ ఛార్ల్స్ (118: 46 బంతుల్లో, 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శతక్కొట్టాడు.
దీంతో ఇక సౌతాఫ్రికా పనైపోయిందిలే అనుకున్నారంతా. కానీ ఓపెనర్లు డి కాక్ (100: 44 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), హెండ్రిక్స్ (68: 28 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) వీర లెవెల్ లో ఉతికేశారు. పవర్ ప్లేలోనే స్కోరును వంద దాటించేశారు. డి కాక్ అయితే తన మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ కూడా బాదేశాడు. హెండ్రిక్స్, కెప్టెన్ మార్ క్రమ్ (38 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అదరగొట్టటంతో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఏడు బంతులు ఉండగానే సౌతాఫ్రికా గెలిచేసింది. చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసేసింది.
క్వింటన్ డికాక్ మెరుపు సెంచరీ
దక్షిణాఫ్రికా తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ చేశాడు. క్వింటన్ డికాక్ కేవలం 44 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఇది కాకుండా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కేవలం 28 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
అదే సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రిలే రౌసో నాలుగు బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 7 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ తరఫున జాన్సన్ చార్లెస్ కూడా
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ నష్టానికి 258 పరుగులు చేసింది. వెస్టిండీస్ తరఫున జాన్సన్ చార్లెస్ అద్భుత సెంచరీ చేశాడు. జాన్సన్ చార్లెస్ 46 బంతుల్లోనే 118 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఇక కైల్ మేయర్స్ 27 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
అదే సమయంలో రోమారియో షెపర్డ్ 18 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున వేన్ పార్నెల్ 2 వికెట్లు తీశాడు. ఈ బౌలర్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మార్కో జాన్సెన్ 4 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.