Mirabai Chanu Wins Silver:  కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.  200 కేజీల (స్నాచ్ 87 కేజీలు మరియ్ క్లీన్ అండ్ జర్క్ 113 కేజీలు) విభాగంలో మొత్తం 200 కేజీలు ఎత్తిన మీరాబాయి రెండో స్థానం దక్కించుకుంది. చైనీస్ క్రీడాకారిణి జియాంగ్ హుయిహువా 206 కేజీలు (స్నాచ్ 93, క్లీన్ అండ్ జర్క్ 113) కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హౌ జిహుయ్ 198 (89 కేజీలు ప్లస్ 109 కేజీలు)తో కాంస్యం సాధించింది.


మీరాబాయి తన రెండో ప్రయత్నంలో క్లీన్ అండ్ జర్క్ విభాగంలో ఓవర్ హెడ్ లిఫ్ట్ తో ఇబ్బందిపడింది. అయినా కూడా 113 కిలోల అత్యుత్తమ లిఫ్ట్ తో రౌండ్ ను పూర్తిచేసింది. స్నాచ్ ఈవెంట్ లో ఆమె 87 కేజీలు ఎత్తింది. మొత్తం 200 కేజీలు ఎత్తి రజత పతకాన్ని అందుకుంది. 


మీరాబాయికి ఇది రెండో ప్రపంచ పతకం. గతంలో 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 194 కిలోల (85 కిలోలు ప్లస్ 109 కిలోలు) లిఫ్ట్‌తో స్వర్ణం గెలుచుకుంది. 2019 ఎడిషన్‌లో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. ఒలింపిక్ ఛాంపియన్ హౌ ఆ రోజు తన వ్యక్తిగత బెస్ట్‌ల కంటే స్నాచ్‌లో 96 కిలోలు మరియు క్లీన్ అండ్ జెర్క్‌లో 118 కిలోలు ఎత్తింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ నిబంధనలప్రకారం, ఒక లిఫ్టర్ తప్పనిసరిగా రెండు ఈవెంట్లలో పోటీపడాలి. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు మొదటి క్వాలిఫైయింగ్ ఈవెంట్.


ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను కి పోలీస్ ఉన్నతోద్యోగం


టోక్సో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానుకి పోలీసు ఉన్నతోద్యోగం ఇచ్చి గౌరవించింది మణిపూర్ ప్రభుత్వం. టోక్సో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలిచిన చానుకి....ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు అప్పుడే ప్రకటించిన సీఎం బీరేన్ సింగ్....ఆమెను స్పోర్ట్ విభాగానికి అదనపు ఎస్పీగా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో మీరాబాయి చాను ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా చాను ను సీఎం బీరేన్ సింగ్ అభినందించారు. తన తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలను స్వీకరించిన చాను...అనంతరం వారిని తన సీట్లో కూర్చోపెట్టి ఆనందపడింది. మణిపూర్ లో క్రీడల అభివృద్ధికి ఏఎస్పీ గా తన వంతు సహకారం అందిచనున్నారు మీరాబాయి చాను.