Roger Federer keeps his promise: టెన్నిస్‌లో మోడర్న్ లెజెండ్ రోజర్ ఫెదరర్. తన కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్స్ సాధించాడు. ఇక తన కెరీర్ లాస్ట్ స్టేజ్‌కు వచ్చేశాడు. ఇప్పుడు ఓ పిల్లాడికి ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చి అందరి హృదయాలనూ గెలుచుకుంటున్నాడు.


ఇది 2017 నాటి సంఘటన. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇజ్యాన్ అహ్మద్ అనే ఓ పిల్లాడు రోజర్ ఫెదరర్ ను ఓ ప్రశ్న అడిగాడు. 'ప్లీజ్ మీరు ఇంకో 8-9 ఏళ్ల పాటు టెన్నిస్ ఆడటం కొనసాగిస్తారా! ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ప్లేయర్ అయ్యాక మీతో ఆడాలనుకుంటున్నా' అని అన్నాడు. ఫెదరర్ అందుకు సరేనన్నాడు. ఆ పిల్లాడు చాలా అమాయకంగా ప్రామిస్ చేస్తున్నారా అని అడ్డగా పింకీ ప్రామిస్ అంటూ రోజర్‌ నవ్వుతూ బదులిచ్చాడు. అక్కడితో ఆ ఇన్సిడెంట్ అయిపోయింది.



ఆ పిల్లాడు కొన్నాళ్లకు ఈ మర్చిపోయి ఉంటాడేమో కానీ ఫెదరర్ మర్చిపోలేదు. ఐదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2022 లో ఆ పిల్లాడు జీవితాంతం మర్చిపోలేని ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. స్నేహితులంతా జిజూ అని పిలుచుకునే ఇజ్యాన్ అహ్మద్ ఇప్పుడు ఓ టెన్నిస్ ప్లేయర్. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ కు మనం ట్రైనింగ్ కు వెళ్తున్నామని చెప్పి అతని కోచ్ జ్యూరిచ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ క్లబ్ కు వెళ్లిన జిజూకు స్వీట్ సర్ ప్రైజ్ లు, స్వీట్ షాకులు వరుసగా తగిలాయి.


ఆ క్లబ్ మేనేజర్ జిజూకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటూ పరిచయం చేసుకుంది. సెల్ఫీ తీసుకోవచ్చా అని కోరింది. తన టీ షర్ట్ మీద జిజూ బొమ్మ ప్రింట్ చేసుకున్నట్టు చూపించింది. ఆ క్లబ్ మేనేజర్ తో కలిసి అతడు ఫొటో దిగాడు. అది జరిగిన వెంటనే క్లబ్ చుట్టూ కొందరు పిల్లలు జిజూ జిజూ అంటూ అతడి పేరే అరుస్తున్నారు. ఇది ఆ కుర్రాడికి మరో షాక్.


అసలు అన్నింటికన్నా పెద్ద షాక్ ఆ తర్వాత తగిలింది. హఠాత్తుగా కోర్టులోకి రోజర్ ఫెదరర్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో జిజూకు నోట మాట రాలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పిల్లాడితో టెన్నిస్ ఆడాడు. అతని ఆటను మెచ్చుకున్నాడు. కొన్ని టిప్స్ ఇచ్చాడు. మ్యాచ్ అయ్యాక వాళ్లిద్దరూ కలిసి పాస్తా తిన్నారు. సో ఈ రకంగా ఐదేళ్ల క్రితం ఇచ్చిన మాటను మర్చిపోకుండా నిలబెట్టుకున్నందుకు ఫెదరర్ ను అందరూ అభినందిస్తున్నారు.