అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు సపోర్ట్‌గా భారత స్టార్ క్రికెటర్లు వారిని విష్ చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్వయంగా మాట్లాడినట్లు అండర్-19 భారత్ కెప్టెన్ యష్ ధుల్ తెలిపారు. 


ఒక సీనియర్ ప్లేయర్ మాట్లాడినప్పుడు తమలో కాన్పిడెన్స్ పెరుగుతుందని యష్ చెప్పాడు. క్రికెట్‌లో బేసిక్స్ గురించి, గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఎలా ఆడాలనే అంశంపై విరాట్ సలహాలు ఇచ్చారని తెలిపాడు. తన మాట్లాడటం విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు.


దీంతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఈ యువ ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. కూ పోస్టు ద్వారా ఆయన తన శుభాకాంక్షలను షేర్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఒక వీడియో బైట్ ద్వారా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు.


కేవలం మన ఆటగాళ్లు మాత్రమే కాకుండా జో రూట్, జోస్ బట్లర్, శామ్ కరన్ వంటి ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు కూడా.. ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో ఇంగ్లండ్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన గ్రేమ్ స్వాన్ ఈ మ్యాచ్‌కు కామెంటరీ బాక్స్‌లో ఉండనున్నారు.