Gukesh VS US President: గతేడాది చెస్ ప్రపంచంలో సంచలనాన్ని రేకేత్తించాడు భారత ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్. ప్రవాసాంధ్రుడైన గుకేశ్.. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. సింగపూర్ లో జరిగిన టోర్నమెంట్ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ఓడించి టైటిల్ ను సాధించాడు. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నీని గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక గతేడాది వరుస విజయాలతో దూసుకు పోయన గుకేశ్ కి సంపాదన కూడా అదే రేంజీలో లభ్యమైనట్లు తెలుస్తోంది. తాజా కథనాల ప్రకారం అమెరికా అధ్యక్షుడి సంపాదన కంటే కూడా ఎక్కువగా గుకేశ్ సంపాదించినట్లు సమాచారం. గతేడాది మొత్తం మీద ప్రైజ్ మనీల రూపంలోనే 15, 77, 842 అమెరికన్ డాలర్లు సంపాదించినట్లు సమాచారం. ఇది భారత కరెన్సీలో ఏకంగా రూ.13.6 కోట్లు కావడం విశేషం. అలాగే దీనికితోడు ఎండార్స్మంట్లు, తమిళనాడు ప్రభుత్వ రూ.5 కోట్ల నజరానా, గుకేశ్ చదివిన స్కూల్ వెళమ్మల్ విద్యాలయ స్కూల్ బహుకరించిన మెర్సిడీస్ బెంబజ్ ీ క్లాస్ కారు అదనం. అంతా కలుపుకుని కోట్లాది రూపాయలు గుకేశ్ వెనకేశాడని తెలుస్తోంది. ఇక గుకేశ్ ప్రైజ్ మనీని చూసి అతని అభిమానులు సంతోషిస్తున్నారు. తను సామన్యుడు కాదని, చెస్ ప్రపంచంలో రికార్డులు నెలకొల్పుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
17 మంది ప్లేయర్లు..
భారత్ లో చెస్ పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రైజ్ మీన కూడా బాగానే వస్తుండటంతో ఈ ఆటను చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. 2024లో మొత్తం 17 మంది ప్లేయర్లు లక్ష డాలర్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ సంపాదించారని పలు నివేదికల్లో వెల్లడవుతోంది. ఇందులో తెలుగు తేజం కోనేరు హంపీతో సహా ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. సంచలన ప్లేయర్ ప్రజ్నానంద 2,02,136 డాలర్ల ప్రైజ్ మనీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తెలుగు కుర్రాడు అర్జున్ ఎరిగైసీ 1,19,767 అమెరికన్ డాలర్లు సంపాదించాడని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే మిలియన్ డాలర్ల సంపాదనను కళ్ల జూశారని సమాచారం. అలాగే ఆరుగురు నాలుగు లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సంపాదించగా, అలాగే 17 మంది కనీసం లక్ష డాలర్ల కంటే ఎక్కువే సంపాదించారు.
US అధ్యక్షుని జీత భత్యాలు..
ఇక అమెరికా అధ్యక్షునికి ఈ స్థాయిలో జీతభత్యాలు లేవు. ఏడాదికి నాలుగు లక్షల డాలర్ల జీతంతోపాటు 50 వేల డాలర్లు ఖర్చుల కింద ఇస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్స్ కిద లక్ష డాలర్లు, ఎంటర్మైన్మెంట్ ఖాతాలో 19 వేల డాలర్లు చెల్లిస్తారు. మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ సంపాదనలో కాస్త వెనుక బడినట్లు తెలుస్తోంది. తను 2024లో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే కార్ల్ సెన్ వారసుడు డింగ్ లిరెన్ .. ప్రపంచ చాంపియన్షిప్ లో ఆడటంతో చాలా లాభ పడ్డాడు. తను ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆలీ రెజా ఫిరోజా మూడో స్థానంలో దక్కించుకున్నాడు. గ్రాండ్ చెస్ టూర్లో ప్రదర్శన ద్వారా అధిక మొత్తంలో ప్రైజ్ మనీ కొల్లగొట్టాడు.