Tata Steel Chess India 2023: ఇటీవలే ముగిసిన చెస్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించిన తమిళనాడు యువ సంచలనం రమేశ్‌బాబు ప్రజ్ఞానంద.. కోల్‌కతా వేదికగా ముగిసిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గురువారం తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ఐదు పాయింట్లతో నిలిచిన ప్రజ్ఞానంద.. రష్యన్ ప్లేయర్ అలెగ్జాండర్ గ్రిషుక్, మరో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీలతో కలిసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
తొలిసారి భారత్‌లో ఆడుతున్న ఫ్రెంచ్ ప్లేయర్ మాక్జిమ్ వాషిర్ ఏడు పాయింట్లతో టైటిల్‌ను దక్కించుకున్నాడు. అజర్‌బైజాన్ ఆటగాడు, 2019లో వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తైమూర్ రెండో స్థానంలో నిలిచాడు. తైమూర్ 5.5 పాయింట్లతో ఉండగా ప్రజ్ఞానంద, గ్రిషుక్, విదిత్‌లు ఐదు పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ప్రజ్ఞానంద, విదిత్‌లు మూడో స్థానంలో నిలవగా భారత్‌కే చెందిన గ్రాండ్ మాస్టర్‌లు గుకేశ్ (4.5 పాయింట్లు) ఆరో స్థానంలో దక్కించుకోగా 3 పాయింట్లు సాధించిన అర్జున్ ఇరిగేశి, 2.5 పాయింట్లతో ఉన్న హరికృష్ణ వరుసగా 9,10 వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ పోటీలలో భాగంగా ఎనిమిదో రౌండ్‌లో భారత నెంబర్ వన్ చెస్ ప్లేయర్ గుకేశ్.. వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మధ్య జరిగిన హోరాహోరి పోరులో గుకేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తమిళనాడుకే చెందిన ఈ ఇద్దరి పోటీ అభిమానుల్లో ఆసక్తిని రేపింది. భవిష్యత్‌లో భారత చెస్ రంగానికి కీలక ఆటగాళ్లుగా మారనున్న ఈ ఇద్దరి పోరులో గుకేశ్.. 45 ఎత్తులలో ప్రజ్ఞానందను ఓడించాడు.
కాగా ఇటీవలే ముగిసిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రజ్ఞానంద.. అత్యంత అనుభవజ్ఞుడైక మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఓడాడు. ఈ పోటీలో ఓడినప్పటికీ ప్రజ్ఞానంద మాత్రం చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్ రన్నరప్‌గా అవతరించాడు. శ్వనాథన్ ఆనంద్ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహామహులను ఢీకొట్టగల ధీరుడు మనకున్నాడని చాటాడు. భవిష్యత్తులో కచ్చితంగా గెలుస్తాననే ధీమాను కల్పించాడు. ఇటీవలే ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. కార్ల్‌సన్ కూడా మానవమాత్రుడేనని అతడిని ఓడించడం సాధ్యమేనని కాదని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial