ఇండోనేషియాలో ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి సంచలన ప్రదర్శన చేసింది. వీరు పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లారు. హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్​లో ఏడో సీడ్‌ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్​ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె జోడీని చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది.


దీంతో బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 ​టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొద‌టి భార‌త జోడీగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి రికార్డు సృష్టించారు. ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా​ 67 నిమిషాల పాటు సాగింది. మొదటి సెట్‌ను భారత ద్వయం 17-21తో కోల్పోయింది. కానీ మిగతా రెండు సెట్లలో హోరాహోరీగా పోరాడి 17-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది.


ఇక క్వార్టర్‌లో క్వార్టర్లో సాత్విక్‌, చిరాగ్‌ డామినేషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! 6-6తో స్కోరు సమంగా ఉన్నప్పుడు అటాకింగ్‌ గేమ్‌తో చెలరేగారు. వరుసగా 6 పాయింట్లు సాధించి 14-7తో ఆధిపత్యం చెలాయించారు. అదే ఊపులో 21-13తో తొలి గేమ్‌ ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ స్కోరు 7-7తో సమమైంది. ఆపై భారత జోడీని ఆపడం ప్రత్యర్థి తరం కాలేదు. వరుసగా 2, 3 పాయింట్లు సాధిస్తూ 21-13తో గేమ్‌తో పాటు మ్యాచునూ కైవసం చేసుకున్నారు.