Saina Nehwal Retirement: ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎలైట్ క్రీడలపై ఫోకస్ చేయలేకపోతున్నానని, బాడీ సహకరించడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నైనా స్పష్టం చేశారు. లండన్ ఒలింపిక్స్ 2012 కాంస్య పతక విజేత సైనా చివరి పోటీ మ్యాచ్ 2023 సింగపూర్ ఓపెన్‌లో ఆడారు.

Continues below advertisement

ఒక పోడ్‌కాస్ట్‌లో నైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. 'నేను రెండేళ్ల కిందటే ఆడటం మానేశాను. నేను నా సొంత నియమాల ప్రకారం ఆడటం ప్రారంభించాను. ప్రస్తుతం వీడ్కోలు పలికే సమయం వచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించాలి అనిపించలేదు.’  అని బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

కెరీర్ దెబ్బతీసిన మోకాలి గాయం

Continues below advertisement

రియో 2016 ఒలింపిక్స్‌లో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో సైనా కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. అయితే, ఆమె అద్భుతమైన కంబ్యాక్ చేస్తూ 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గడంతో పాటు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కానీ మోకాలి సమస్యలు ఆమెను ఆటకు దూరం చేస్తున్నాయి. 2024లో సైనా తన మోకాళ్లలో ఆర్థరైటిస్ సమస్య ఉందని, మృదులాస్థి పూర్తిగా అరిగిపోయిందని, ఇది టాప్ లెవెల్‌లో ఆడటం దాదాపు అసాధ్యం అని వెల్లడించింది. తాజాగా రిటైర్మెంట్ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఆమె విజయాలు ఇవే..

- ఒలింపిక్ కాంస్య పతకం: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించింది.

- ప్రపంచ నంబర్ 1: ఏప్రిల్ 2015లో ఆమె ప్రపంచ నంబర్ 1 మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ర్యాంక్ సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్ ఆమె.

- ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం: 2015లో రజత పతకం, 2017 చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించింది.

- కామన్వెల్త్ గోల్డ్: 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్, 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.

- BWF సూపర్ సిరీస్: ఇండోనేషియా ఓపెన్, హాంగ్ కాంగ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ వంటి అనేక పెద్ద టోర్నమెంట్‌లను గెలుచుకుంది. ఆమె పేరు మీద అనేక ఎలైట్ టైటిల్స్ ఉన్నాయి.

- ప్రపంచ జూనియర్ ఛాంపియన్: 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది.

- అవార్డులు: భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారాలు అందుకుంది. ఖేల్ రత్న (2009), పద్మశ్రీ (2010) పద్మ భూషణ్ (2016) లతో కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది.