టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్‌కు.. రోహిత్ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.
అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనపపడం లేదు. అత్యధిక సిక్సుల విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒక్కడే 315 సిక్స్‌లతో టాప్ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టాప్ టెన్‌లో మిగిలిన బట్లర్, రోహిత్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ రిటైర్ అయిపోయారు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయంగా అత్యధిత సిక్స్‌లు బాదిన టాప్ 5 బ్యాటర్లు..
రోహిత్ శర్మ - భారత్ 554 సిక్సర్లు
క్రిస్ గేల్ - వెస్టిండీస్ 553 సిక్సర్లు
షాహిద్ అఫ్రిదీ - పాకిస్థాన్ 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ - న్యూజిలాండ్ 389 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ - న్యూజిలాండ్ 383 సిక్సర్లు
స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గానూ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. హిట్‌మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) సిక్సులతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా రోహిత్ శర్మ అవతరించాడు.
రోహిత్ మరో రికార్డు
రోహిత్ తన కెరీర్‌లో ప్రస్తుతం మూడో వన్డే ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఈ మూడు ఎడిషన్‌లలో రోహిత్ 18 మ్యాచుల్లో కలిపి 978 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. 2015లో ఒక సెంచరీ బాదగా.. 2019లో ఏకంగా 5 శతకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ వెయ్యి పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసి వార్నర్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో వేగంగా వెయ్యిపరుగులు చేసిన ఆటగాళ్లుగా వార్నర్(19), రోహిత్(19) కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు
సచిన్ తెందూల్కర్ 45 మ్యాచుల్లో 2278 పరుగులు
విరాట్ కోహ్లీ 27 మ్యాచుల్లో 1115 పరుగులు
రోహిత్ శర్మ 19 మ్యాచుల్లో 1000+
సౌరభ్ గంగూలీ 21 మ్యాచుల్లో 1006 పరుగులు
రాహుల్ ద్రవిడ్ 22 మ్యాచుల్లో 860 పరుగులు