ముగ్గురు క్రికెటర్ల టెస్ట్ డెబ్యూ ఒకే రోజున.. 


జూన్‌ 20. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. మిష్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, అందరూ దాదాగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఇదే రోజున టెస్ట్ క్రికెట్ డెబ్యూ మ్యాచ్ ఆడారు. 1996లో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడగా, 2011 జూన్ 20వ తేదీన విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వీళ్లు ముగ్గురూ కలిసి ఇప్పటి వరకూ టెస్ట్ క్రికెట్‌లో 28,543 పరుగులు చేసి ఇండియన్ క్రికెట్‌ హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వీరిలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ కెప్టెన్‌లుగానూ తమ మార్క్ చూపించారు. 


సౌరవ్, ద్రవిడ్ సూపర్ ఇన్నింగ్స్  


1996లో లార్డ్స్‌ స్డేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఒకేసారి డెబ్యూ ఇచ్చారు. గంగూల్‌ థర్డ్‌ డౌన్‌లో ఆడగా, ద్రవిడ్ సెవెన్త్‌ డౌన్‌లో క్రీజులోకి వచ్చారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ కలిసి 94 పరుగులు చేశారు. అప్పటికి మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న ఫ్యాన్స్ వీరిద్దరి కన్సిస్‌టెన్సీతో మ్యాచ్ మళ్లీ మన చేతుల్లోకి వచ్చేసిందని సంబరపడ్డారు. సౌరవ్ గంగూలీ 301 బాల్స్‌కి 131 పరుగులు చేయగా, ద్రవిడ్ 267బాల్స్‌కి 95 రన్స్ చేశాడు. లార్డ్స్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ గురించి ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. 


తొలి మ్యాచ్‌లో తడబడ్డ కోహ్లీ 


ఇక విరాట్ కోహ్లీ మాత్రం తొలి టెస్ట్ మ్యాచ్‌లో తడబడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ కోహ్లీ మాత్రం రన్స్ చేయటంలో చాలా వెనకబడ్డాడు. ఫిడెల్ ఎడ్‌వర్డ్స్ బౌలింగ్‌లో సులువుగా ఔట్ అయ్యాడు. రెండు సార్లు క్రీజ్‌లోకి దిగినా.. 4,15 రన్లతో సరిపెట్టుకున్నాడు. ద్రవిడ్ కూడా ఈ మ్యాచ్ ఆడాడు. అప్పటికి ద్రవిడ్ టెస్ట్ మ్యాచ్‌ల్లోకి 15 ఏళ్లు. ఈ మ్యాచ్‌లోనూ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 67 బాల్స్‌కి 40 పరుగులు చేయగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో థర్డ్‌ డౌన్‌లో దిగి ఏకంగా సెంచరీ చేశాడు.