Jaspals obsession with shooting behind Manu Bhaker's Olympic success: ఒలింపిక్స్(Olympics 2024)లో ఫైనల్స్ జరుగుతోంది. షూటర్లు హోరాహోరీగా తలపడుతున్నారు. గత విశ్వక్రీడల్లో చేసిన పేలవ ప్రదర్శన ఆ షూటర్‌ను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె దూరం నుంచి తననే ఉత్కంఠగా చూస్తున్న తన కోచ్ వైపు చూసింది. ఆయన్ను చూడగానే ఆమెకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. అంతే ఈసారి ఆ షూటర్ గురి తప్పలేదు. మనకు కాంస్యం రాక తప్పలేదు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే ఆర్థమైపోయింది కదా. ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల వేటను ప్రారంభించిన షూటర్ మను బాకర్. మను బాకర్(Manu bhaker) ఈ పతకం సాధించడం వెనక కోచ్ జస్పాల్ రాణా పాత్ర ఎంతో ఉంది. తన కోచ్ జస్పాల్ రాణా(Jaspal Rana)ను చూస్తే తనకు ఎంతో ధైర్యం వస్తుందని.. అందుకే ఫైనల్ జరిగేటప్పుడు ఆయన్ను తప్ప ఇంకెవర్నీ చూడొద్దని గట్టిగా నిర్ణయించుకున్నానని పతకం సాధించిన అనంతరం మను బాకర్ వ్యాఖ్యానించింది. జస్పాల్ తన తండ్రిలాంటి వారని భావోద్వేగానికి గురైంది. తన శిష్యురాలు పతకం సాధించిన ఆ అపురూప సన్నివేశాన్ని చూసి కోచ్ జస్పాల్ రాణా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే వారిది ఒకే లక్ష్యం కోసం కలిసి సాగిన ప్రయాణం.
గొడవపడి మళ్లీ కలిసి
అది టోక్యో ఒలింపిక్స్ భారీ అంచనాలతో బరిలోకి దిగిన మనుబాకర్ సరైన ప్రదర్శన చేయలేదు. రిక్తహస్తాలతో భారత్ వెనుదిరిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగి ఒలింపిక్స్ నుంచి ఒక్క పతకం సాధించకపోవడం మనూను తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో తన వ్యక్తిగత కోచ్ జస్పాల్ రాణా తన పక్కన లేడు. ఏదో విభేదాలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు. తన కోచ్ తన పక్కన లేకపోవడం తనకు ఎంత నష్టమో మనూ గుర్తించింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కోచ్ దగ్గరికి వెళ్లిపోయింది. మళ్లీ కలిసి పనిచేద్దామని వేడుకుంది. దానికి కోచ్ అంగీకరించాడు. ఇక అంతే మను బాకర్ కెరీర్ మళ్లీ గాడిన పడింది. అద్భుతాలు సృష్టించడం ఆరంభమైంది. మనూ టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చిన అతను... ఆమెను మరింత ధైర్యంగా తీర్చిదిద్దాడు. ప్రతీ పాయింట్ ఎంత విలువైందో వివరించాడు. విజయం ఎందుకంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పాడు. అదే మనూలో మార్పు తీసుకొచ్చింది. పతకం వచ్చేలా చేసింది.
విజయవంతమైన షూటర్ కూడా..
మనూ బాకర్ విజయంలో కీలకపాత్ర పోషించిన జస్పాల్ రాణాకు.. షూటింగ్‌లో ప్రతీ విషయంపై క్షుణమైన అవగాహన ఉంది. జస్పాల్ రాణాకు షూటింగ్ అంటే చాలా ఇష్టం. అంకితభావం, అపూర్వ ప్రతిభతో తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోనూ పతకం సాధించాడు. 2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ మూడు బంగారు పతకాలు సాధించాడు జస్పాల్. ఇది షూటింగ్‌పై అతడికు ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఈ రికార్డును ఇప్పటివరకూ ఏ భారతీయ షూటర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. 1994 హిరోషిమా ఆసియా క్రీడలలో 25 మీటర్ల సెంటర్-ఫైర్ పిస్టల్‌లో స్వర్ణం గెలుచుకున్న నలుగురు భారతీయుల్లో జస్పాల్ కూడా ఒకడు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన మను భాకర్ ఒలింపిక్ పోడియంపై నిలబడి కాంస్యం తీసుకుంటున్నప్పుడు జస్పాల్ ఆనందం చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు