How did Aman Sehrawat shed 4.6 kg just 10 hours before bronze match at Paris Olympics 2024: రెజ్లింగ్‌లో అధిక బరువు భారత రెజ్లర్లను ఆందోళనకు గురిచేస్తున్న వేళ... మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్(Aman Sehrawat... భారత్‌కు కాంస్య పతకం అందించి సత్తా చాటాడు. 57 కేజీల విభాగంలో అమన్ కాంస్యం సాధించాడు. అయితే కాంస్య పతకపోరుకు 10 గంటల ముందు అమన్... 57 కేజీల నిర్ణీత బరువు కంటే అమన్ అధిక బరువు ఉన్నట్లు తెలిసింది. దీంతో అమన్ కేవలం 10 గంటల్లో నాలుగున్నర కేజీల బరువు తగ్గాడు. అమన్ తీవ్రంగా శ్రమించి బరువు తగ్గి మరీ భారత్‌కు పతకాన్ని అందించాడు. కేవలం 100 గ్రాముల బరువు కారణంగా వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఈ అనర్హత వేటుతో భారత అభిమానుల పతక ఆశలు కూలిపోయాయి. ఆ ఆశలు నిలబెట్టాలని ఉక్కు సంకల్పంతో ఉన్న అమన్.. బరువు తూచుకున్నప్పుడు అధిక బరువు ఉన్నట్లు తేలింది. అమన్ కూడా పోటీకీ 10 గంటల ముందు అధిక బరువు ఉన్నట్లు తేలింది. దీంతో అమన్ తీవ్రంగా శ్రమించి కేవలం 10 గంటల వ్యవధిలోనే నాలుగున్నర కేజీలు తగ్గాడు.
అవిశ్రాంత వర్కౌట్లు
బరువు తగ్గించుకునేందుకు అమన్ అవిశ్రాంతంగా పది గంటల పాటు కసరత్తులు చేస్తూనే ఉన్నట్లు భారత రెజ్లింగ్ వర్గాలు వెల్లడించాయి. కోచ్‌లు, వ్యక్తిగత సిబ్బంది, వైద్యుల పర్యవేక్షణలో అమన్ సెహ్రావత్.... కేవలం 10 గంటల్లో 4.6 కిలోల బరువు తగ్గడాన్ని వెల్లడించాయి, అలా వేగంగా బరువు తగ్గడంతో పారిస్ ఒలింపిక్స్ 2024లో 57 కిలోల విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. సెమీఫైనల్ తర్వాత సెహ్రావత్ బరువు 61.5 కిలోలకు చేరుకుంది. ఇది అమన్ పోటీపడే 57 కిలోల కంటే 4.5 కేజీలు ఎక్కువ. దీంతో భారత బృందం అప్రమత్తమైంది. వెంటనే చర్యలకు దిగింది. బరువు తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంది. భారత కోచ్‌లు జగ్మండీర్ సింగ్, వీరేంద్ర దహియాలు అమన్ బరువు తగ్గించేందుకు ప్రణాళిక రచించి అమలు చేశారు. ఇప్పటికే వినేష్ ఫోగట్ కేవలం 100 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురికావడంతో కోచ్‌లు వెంటనే అప్రమత్తమయ్యారు. 10 గంటలపాటు నిర్విరామంగా పనిచేశారు. అవిశ్రాంతంగా శ్రమించారు. ఈ శ్రమతో అమన్ సెహ్రావత్ కేవలం 10 గంటల్లో 4.6 కిలోలు తగ్గాడు.
అమన్ ఎలా తగ్గాడంటే..?
బరువు తగ్గేందుకు అమన్ సెహ్రావత్ తొలుత దాదాపు గంటన్నరపాటు కుస్తీ పట్టాడు. తర్వాత గంటసేపు హాట్ బాత్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఒక గంట ట్రెడ్‌మిల్‌పై వేగంగా రన్నింగ్ చేశాడు. ఆ తర్వాత సెహ్రావత్‌కు 30 నిమిషాల విరామం ఇచ్చారు. ఆ తర్వాత చెమట పట్టడం ద్వారా బరువు తగ్గడానికి 5 నిమిషాలపాటు ఆవిరి స్నానం చేశాడు. ఎంత ప్రయత్నించినా ఇంకా బరువు 900 గ్రాములు అధికంగానే ఉంది. ఆ తర్వాత జాగింగ్, మళీ 15 నిమిషాలు రన్నింగ్ చేశాడు. ఆ తర్వాత సెహ్రావత్‌కి నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు అమన్ బరువు 56.9 కిలోలకు చేరింది. అంటే 57 కిలోల కంటే కేవలం 100 గ్రాములు బరువు తక్కువకు వచ్చింది. తాము ప్రతి గంటకు అమన్ బరువును తనిఖీ చేస్తూనే ఉన్నామని.. తాము రాత్రంతా నిద్రపోలేదని.. కోచ్‌లు తెలిపారు.