Vinesh Phogat: కోచ్‌ కీలక వ్యాఖ్యలు, ఫొగాట్‌ భావోద్వేగ లేఖ- రిటైర్మెంట్‌పై పునరాలోచనలో పడిందా!

Vinesh Phogat : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించినా పోటీకి ముందు 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేష్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆ రాత్రి ఏం జరిగిందంటే.

Continues below advertisement

vinesh phogat might die her coach reveals shocking behind the scenes at 2024 paris games : ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగాట్(vinesh phogat) సెమీఫైనల్ పూర్తయిన జరిగిన ఘటనలను కోచ్ వోలర్ అకోస్(Woller Akos) గుర్తు చేసుకున్నారు. సెమీ-ఫైనల్ తర్వాత వినేశ్‌ 2.7 కిలోల అదనపు బరువు ఉందని తాము గుర్తిచామని వెల్లడించారు. గంట ఇరవై నిమిషాల వ్యాయామం తర్వాత 1.5 కిలోల బరువు మిగిలిపోయిందని అకోస్‌ తెలిపారు. తరువాత 50 నిమిషాలు ఆవిరి పట్టామ తెలిపారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30 వరకు ఆమె వ్యాయామాలు, రెజ్లింగ్‌ చేసిందని అకోస్‌ గుర్తుచేసుకున్నారు. తర్వాత వినేశ్‌ రెండు-మూడు నిమిషాల విశ్రాంతితో మళ్లీ వ్యాయామం చేసిందని అన్నారు. తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని వెల్లడించారు. నేను మాములగా నాటకీయ వివరాలను రాయనని... కానీ ఆ రోజు అలా వ్యాయామాలు చేస్తున్న వినేశ్‌ను చూసి చనిపోతుందని అనుకున్నా అని అకోస్‌ తెలిపారు. 

Continues below advertisement

వినేశ్‌ భావోద్వేగ లేఖ
పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తర్వాత అనర్హత వేటుకు గురై తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు.. కాస్‌లోనూ నిరాశ తప్పలేదు. తనకు రజతమైనా ఇవ్వాలన్న వినేశ్‌ అభ్యర్థనను కాస్‌ తిరస్కరించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురయ్యే ముందు ఒలింపిక్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ చరిత్ర సృష్టించింది. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న వినేష్ అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ కోర్టు తోసిపుచ్చింది. ఈ భావోద్వేగ పరిస్థితుల్లో వినేశ్‌ ఫొగాట్ క్రీడా ప్రపంచానికి ఓ భావోద్వేగ లేఖ రాసింది. తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ ఆ లేఖలో వినేశ్‌ ధన్యవాదాలు తెలిపింది. సుదీర్ఘమైన ఈ లేఖలో వినేశ్‌ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది.

 
చివరి వరకూ పోరాడం
ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు తన కష్టాలను వినేశ్‌ ఫొగాట్‌ ఈ లేఖలో గుర్తు చేసుకుంది. తన ఒలింపిక్ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ఆమ ధన్యవాదాలు తెలిపింది. ఫైనల్‌కు ముందు బరువును తూకం వేసే సమయంలో తన బరువు 50 కిలోల మార్కును తాకేందుకు జట్టు చేసిన ప్రయత్నాలను వినేశ్‌ గుర్తు చేసుకుంది. తాము చివరి వరకూ తమ ప్రయత్నాలు ఆపలేదని... ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదని తెలిపింది. తమకు సమయం సరిగ్గా లేదని ఆమె గుర్తు చేసుకున్నారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో... తదుపరి ప్రయాణం ఎలా ఉంటుందో తనకే తెలీదని.. దాని గురించి ఏమీ ఊహించడం లేదని వినేశ్‌ తన లేఖలో పేర్కొన్నారు. తాను నమ్మిన దాని కోసం.. సరైన దాని కోసం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని వినేశ్‌ ఫొగాట్‌ స్పష్టం చేశారు. మూడు పేజీల ఈ సుదీర్ఘ లేఖలో వినేశ్‌ ఇంకా చాలా విషయాలను ప్రస్తావించారు.  కోచ్ వోలర్ అకోస్‌... మహిళల రెజ్లింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్ అని వినేష్ ఫోగాట్ కొనియాడారు.
Continues below advertisement