గాయం నుంచి కోలుకున్న ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు మంచి ఆరంభం లభించింది. స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 


భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా 30 జూన్  2023న జరిగిన డైమండ్ లీగ్‌లో 87.66 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు. గాయం తర్వాత మళ్లీ ఆట ప్రారంభించిన నీరజ్‌కు ఇది గుడ్‌ స్టార్ట్‌గా చెప్పవచ్చు. అయితే మొదటి ప్రయత్నం ఫౌల్ అయింది. కానీ తరువాత కోలుకున్న నీరజ్ తన బెస్ట్ ఇచ్చి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 


ఫస్ట్‌ త్రోలో జర్మనీకి చెందిన వెబర్‌ 86.20 మీటర్లు విరిసితే... చోప్రా ఫస్ట్‌ ప్రయత్నం విఫలమైంది. రెండో, మూడో ప్రయత్నంలో 83.52m, 85.04m విరిశాడు. తర్వాత నాల్గో ప్రయత్నం కూడా విఫలమైంది. మిగిలిన ఆఖరి అవకాశాన్ని చోప్రా సద్వినియోగం చేసుకున్నాడు. ఆఖరి ప్రయత్నంలో ఊహించని విధంగా 87.66మీటర్లు త్రో చేశాడు. తన ఆఖరి ప్రయత్నంలో జర్మనీ ఆటగాడు వెబర్‌ 87.03 మీటర్‌లు మాత్రమే త్రో చేయగలిగాడు. దీంతో నీరజ్‌ చోప్రా విజయం ఖాయమైపోయింది. బంగారు పతకం సొంతమైంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన యాకోబ్ వాడ్లెజ్చే కాంస్య పతకంతో మూడో స్థానంలో నిలిచాడు.


నీరజ్ చోప్రా కెరీర్లో ఇది 8వ స్వర్ణం. ఈ ఏడాది డైమండ్ లీగ్‌లో అతడికిది రెండో స్వర్ణం. గతంలో దోహా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ స్వర్ణ పతకం సాధించాడు.


లాసానే డైమండ్ లీగ్ 2023: పురుషుల జావెలిన్ త్రోలో  ఆటగాళ్ల స్థానం 


1 - నీరజ్ చోప్రా (87.66 మీటర్లు)


2 – జూలియన్ వెబర్ (87.03 మీటర్లు)


3 - జగ్గు వట్లెజ్ (86.13 మీటర్లు)


4 - ఒలివర్ హెలాండర్ (83.50 మీటర్లు)


5 - అండర్సన్ పీటర్స్ (82.20 మీటర్లు)


డైమండ్‌ లీగ్‌లో స్వర్ణం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు నీరజ్‌ చోప్రా. అయితే చాలా నెర్వస్‌గా ఉందన్నాడు. తాను ఇవ్వాల్సిన బెస్ట్ కంటే చాలా వెనుకబడి ఉన్నాను అని అభిప్రాయపడ్డాడు. ఇంకా మెరుగు పరుచుకోవాల్సింది చాలా ఉందన్నాడు. ఈ విజయం ఆనందంగా ఉన్నప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని చెప్పాడు. ఇంకా శిక్షణ తీసుకోవాల్సిందేనని... దానికి కొంత టైం కేటాయించాలని తెలిపారు. అప్పుడే తాను మరింత మెరుగుపడతానని అన్నాడు. తర్వాత జరిగే బుడాపెస్ట్‌ టోర్నీ తనకు ముఖ్యమైనదిగా చెప్పుకొచ్చాడు. 


డైమండ్ లీగ్ లాంగ్ జంప్ ఈవెంట్‌లో మురళీ శ్రీశంకర్ 7.88 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో అతను 5.8 మీటర్లు దూకాడు. అంతకుముందు కాలిఫోర్నియాలో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మురళీ శంకర్ 41.8 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించాడు.


అథ్లెటిక్స్ రౌండ్‌లో మురళీ శంకర్ 8 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు. తొలి రౌండ్‌ను 7.55 మీటర్లు దూకాడు.  తర్వాత రౌండ్లలో 7.63 మీటర్లు, 7.88 మీటర్లకు మార్క్‌ క్రాస్ చేశాడు. 


లాసానే డైమండ్ లీగ్ 2023: పురుషుల లాంగ్ జంప్ పూర్తి వివరాలు


1 - లగువాన్ నాయర్న్ (8.11 మీ)


2 – మిల్టియాడిస్ డెంటోగ్లో (8.07 మీ)


3 – యూకీ హషియోకా (7.98 మీటర్లు)


4 – సైమన్ ఎహమ్మర్ (7.97 మీటర్లు)


5 - మురళీ శ్రీశంకర్ (7.88 మీటర్లు)