Neeraj Chopra Silver: పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగింది. అనంతరం నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రజత పతకం సాధించిన నీరజ్‌ను అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను అభినందిస్తూ.. ఆయన బాగోగులను కూడా ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. వారిద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. ప్రధాని నీరజ్ చోప్రా నుండి అతని గాయం గురించి కూడా తెలుసుకున్నారు. దీనితో పాటు నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా మెచ్చుకున్నారు.
మీ ప్రతిభను మళ్లీ మళ్లీ చూపించారు
ఫోన్‌లో మాట్లాడే ముందు కూడా, పీఏ మోదీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా నీరజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రజత పతకం సాధించినందుకు అభినందనలు అంటూ తన పోస్ట్‌లో రాశాడు. భవిష్యతులో రాబోయే లెక్కలేనటు వంటి అథ్లెట్లు వారి కలలను నెరవేర్చుకోవడానికి, మన దేశం గర్వపడేలా చేయడానికి ఎంతో స్పూర్తిని అందించావంటూ కొనియాడారు. 26 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. అంతకుముందు, నీరజ్ చోప్రా 2020 సంవత్సరంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
తన రికార్డును తానే బద్దలు కొట్టిన నీరజ్
నీరజ్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించారు. నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గత ఒలింపిక్స్‌లో అతను 87.58 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అయితే అతను ఈసారి 89.45 మీటర్లు విసిరారు. నీరజ్ చోప్రా మ్యాచ్ కోసం.. అతని స్వగ్రామం పానిపట్‌లో పెద్ద స్క్రీన్‌ను అమర్చారు.. ఇది మాత్రమే కాకుండా.. అతను పతకం గెలిచినప్పుడు గ్రామం మొత్తం బాణసంచా కాల్చారు. పతకం గెలిచినట్లు ప్రకటించడంతో అతని ఊరంతా ఆనందంతో ఎగిరి గంతేసింది. అందరూ లడ్డూలు పంచుతున్నారు. బాణాసంచా కాల్చారు. కాగా, అర్థరాత్రి వరకు డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ నీరజ్ రజత పతకాన్ని సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు.
నీరజ్ రజతం సాధించడం ద్వారా నాలుగో పతకాన్ని అందించిన అథ్లెట్ గా నిలిచారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీని తర్వాత విక్కీ కౌశల్, ఆర్ మాధవన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్లు నీరజ్ చోప్రాను అభినందించారు.