MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దీని కారణంగా మెగ్ లానింగ్ జట్టు ఫైనల్‌లో నేరుగా ప్రవేశించింది. అదే సమయంలో, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను ఓడించి ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
ఫైనల్‌కు ఇరు జట్ల తుది జట్లు ఏవి?
ఫైనల్ మ్యాచ్‌కి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చే అవకాశం ఉందా? వాస్తవానికి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ సమయంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇది కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. అయితే లీగ్ దశలో ఇరు జట్ల ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. దీని కారణంగా ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు ఏ ప్లేయింగ్ XIతో ఫీల్డ్‌లోకి వస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నటాలీ స్కివెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ మరియు జింటిమణి కలిత
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా)
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, ఎల్లీస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, తాన్యా భాటియా (వికెట్ కీపర్), జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరంగా నిరాశపరిచింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఈ సీజన్‌లో RCB జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. కానీ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఆరు 6 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని తర్వాత, స్మృతి మంధాన, జట్టులోని ఇతర ఆటగాళ్లపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానపై కాసుల వర్షం కురిసింది. కానీ మైదానంలో మాత్రం రాణించలేకపోయింది.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధానను రికార్డు స్థాయిలో రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ప్లేయర్ తన ఆటతో చాలా నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన 18.62 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది.