నూతన ఏడాది వచ్చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాదే వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనున్నాయి. పారిస్‌లో జరిగే ఈ విశ్వ క్రీడా సంరంభంలో పాల్గొనడమే ప్రతి ఆటగాడి జీవిత ధ్యేయం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. మరోవైపు క్రికెట్‌లో ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జరగనుంది. చదరంగానికి తలమానికంగా భాసించే క్యాండిడేట్స్ టోర్నీలో అయిదుగురు భారత చదరంగ దిగ్గజాలు తలపడబోతున్నారు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక టోర్నీలు...
పురుషుల క్రికెట్
జనవరి 3-7: భారత్ -దక్షిణాఫ్రికా రెండో టెస్టు
జనవరి 11-17: భారత్‌లో అఫ్ఘానిస్థాన్ టూర్- 3 టీ20లు
జనవరి 25-మార్చి 11: భారత్‌లో ఇంగ్లండ్ టూర్-5 టెస్టులు
మార్చి నుంచి మే మధ్య : ఐపీఎల్
జూన్ 4-30 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ -వెస్టిండీ్‌స/అమెరికా
జూలై : శ్రీలంకలో భారత జట్టు టూర్-3 వన్డేలు, 3 టీ20లు
సెప్టెంబరు: భారత్‌లో బంగ్లా జట్టు టూర్-2 టెస్టులు, 3టీ20లు
అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్ జట్టు టూర్-3 టెస్టులు
నవంబరు-డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత్ టూర్-5 టెస్టులు
జనవరి 3-మార్చి 14: రంజీట్రోఫీ
జూన్ 28-జూలై 16: దులీప్ ట్రోఫీ
జూలై 24-ఆగస్టు 3: దేవధర్ ట్రోఫీ
అక్టోబరు 1-5: ఇరానీ కప్
అక్టోబరు16-నవంబరు 6: ముస్తాక్ అలీ ట్రోఫీ
నవంబరు 23-డిసెంబరు15: విజయ్ హజారే ట్రోఫీ
మహిళల క్రికెట్
జనవరి- ఆస్ట్రేలియా జట్టు టూర్ - ఏకైక టెస్టు, 3 టీ20లు, 3 వన్డేలు
ఫిబ్రవరి-మార్చి: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
సెప్టెంబరు-అక్టోబరు : ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌క్‌ప-బంగ్లాదేశ్
డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత జట్టు టూర్-3 వన్డేలు
డిసెంబరు: భారత్‌లో వెస్టిండీస్ జట్టు టూర్-3 వన్డేలు, 3 టీ20లు
హాకీ
జనవరి 24-31: హాకీ ఫైవ్స్ వరల్డ్‌కప్ వేదిక -ఒమన్
జనవరి 13-21: మహిళలు, పురుషుల ఒలింపిక్
క్వాలిఫయర్స్-స్పెయిన్, భారత్, ఒమన్
ఫిబ్రవరి 3-9 : ప్రొ.హాకీ లీగ్, మహిళలు-భువనేశ్వర్
ఫిబ్రవరి 10-16: ప్రొ.హాకీ లీగ్, పురుషులు-భువనేశ్వర్
బ్యాడ్మింటన్
జనవరి 16-21 : ఇండియా ఓపెన్ -న్యూఢిల్లీ
మార్చి 12-17 : ఆల్ ఇంగ్లండ్ -బర్మింగ్‌హామ్
ఏప్రిల్ 28-మే 5: థామస్, ఉబెర్ కప్-చైనా
నవంబరు 26-డిసెంబరు 1: సయ్యద్ మోదీ టోర్నీ-లఖ్‌నవూ
డిసెంబరు 11-15: బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-చైనా
చెస్
ఫిబ్రవరి 19-25: ఫిడే వరల్డ్ ర్యాండమ్ చెస్
ఏప్రిల్ 2-25: క్యాండిడేట్స్ చెస్-కెనడా
ఏప్రిల్ 25-29: వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్, బ్లిట్జ్-అల్బేనియా
జూన్ 1-14: వరల్డ్ జూ. అండర్-20 చాంపియన్‌షి్‌ప్స-న్యూఢిల్లీ
జూన్ 22-జూలై 8: వరల్డ్ కప్-అండర్ 8, 10, 12-జార్జియా
జూలై 1-12: వరల్డ్ సీనియర్ టీమ్ చాంపియన్‌షి్‌ప్స-పోలెండ్
సెప్టెంబరు 10-23: ఒలింపియాడ్-హంగేరి
అక్టోబరు-22 - నవంబరు 2: వరల్డ్ యూత్ చాంపియన్‌షి్‌ప్స-బ్రెజిల్
ఫుట్‌బాల్
జూన్ 14-జూలై 14: యూరో ఫుట్‌బాల్-జర్మనీ
జూన్ 20-జూలై 14: కోపా అమెరికా కప్-అమెరికా
టెన్నిస్
జనవరి 14-28 : ఆస్ట్రేలియన్ ఓపెన్-మెల్‌బోర్న్
మే 20-జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్-పారి్‌స
జూలై 1-14: వింబుల్డన్-లండన్
ఆగస్టు 26-సెప్టెంబరు 8: యూఎస్ ఓపెన్-న్యూయార్క్
మరికొన్ని ప్రధాన టోర్నీలు
జనవరి 12-ఫిబ్రవరి 10 : ఆసియా కప్ ఫుట్‌బాల్-ఖతార్
జనవరి 31-ఫిబ్రవరి 11: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-మధ్యప్రదేశ్
జనవరి 23-28 : వరల్డ్ టీటీ స్టార్ట్ కంటెండర్-గోవా
ఫిబ్రవరి : ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-గువాహటి
ఫిబ్రవరి 2-18 : వరల్డ్ అక్వాటిక్ చాంపియన్‌షి్‌ప్స-దోహా
ఫిబ్రవరి 16-25: వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షి్‌ప్స-దక్షిణాఫ్రికా
ఏప్రిల్ 11-16: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప్స-కిర్గిస్థాన్
ఏప్రిల్ 12-14 : శాఫ్ జూ.అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స-చెన్నై
ఏప్రిల్ 20-మే 6: వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షి్‌ప్స-యూకే
జూన్ 6 : ఎన్‌బీఏ ఫైనల్స్-అమెరికా/కెనడా
జూలై 6-ఆగస్టు 11: ఒలింపిక్స్- పారిస్
జూన్ 29-జూలై 21: టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్-ఫ్రాన్స్
సెప్టెంబరు 20-22 : ఇండియన్ గ్రాండ్ ప్రీ మోటో జీపీ-గ్రేటర్ నోయిడా