అరుదైన రికార్డు సాధించిన వేదాంత్..
ప్రముఖ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించాడు. రికార్డులసూ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడీ లిస్ట్‌లో మరోటి చేరింది. జూనియర్ నేషనల్ ఆక్వాటిక్స్‌లో అరుదైన రికార్డు సాధించాడు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో 1500మీటర్ల ఫ్రీస్టైల్‌లో విన్నర్‌గా నిలిచాడు. 48వ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఈ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ ఫ్రీస్టైల్‌ను 16 నిముషాల్లో పూర్తి చేయగా, వేదాంత్ దాన్ని 6 నిముషాల్లోనే పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అంతకు ముందు అద్వైత్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు మాధవన్. "నెవర్ సే నెవర్" అని కోట్ చేస్తూ వేదాంత్ స్విమ్మింగ్ వీడియోను షేర్ చేశారు. స్పోర్ట్స్ పట్ల వేదాంత్‌కు ఎంత ఆసక్తి ఉందో, చాలా సందర్భాల్లో ప్రస్తావించారు మాధవన్. పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇదే చెప్పారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పలు పతకాలు సాధించాడు వేదాంత్. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయిపోయాడు. "మాధవన్ అబ్బాయి అనే ట్యాగ్ నాకు అవసరం లేదు. అది నాకు ఇష్టం లేదు కూడా. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని అనుకుంటున్నాను" అని చెప్పాడు వేదాంత్. గతేడాది మాధవన్, ఆయన సతీమణి సరిత దుబాయ్‌కు వెళ్లిపోయారు. అక్కడ స్విమ్మింగ్ పూల్స్‌కు సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.