Archery World Cup Stage 1 Updates: ప్రపంచ యవనికపై తెలుగుమ్మాయి మెరిసింది. విల్లు చేతబట్టి, ఆర్చరీ వరల్డ్ ను తన వైపు తిప్పుకుంది. ఆర్చరీ ప్రపంచకప్ లో బంగారు పతకంతో వెన్నం జ్యోతీ సురేఖ సత్తా చాటింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం కొల్లగొట్టింది.. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిషబ్ యాదవ్‌తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి-రిషబ్ జోడీ 153-151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ జౌ-చెన్ చిహు లిన్ జంటపై గెలుపొందింది. జ్యోతి జంటకు ముందుగా అనుకున్నట్లుగా ఆడలేదు. తొలి రెండు సెట్లలో(37-38, 37-39) చైనీస్ తైపీ ఆర్చరీలే ముందంజ వేశారు. రెండు సెట్లు ముగిసే సరికి 75-77తో వెనుకబడిన జ్యోతి, రిషబ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. మూడో సెట్‌లో 39-38తో నెగ్గి ప్రత్యర్థులు లీడ్‌ను 114-115తో గణనీయంగా తగ్గించారు. ఇక, నాలుగో సెట్‌లో సత్తాచాటిన జ్యోతి, రిషబ్ 39-36తో అద్భుతంగా పైచేయి సాధించి, మొత్తంగా రెండు పాయింట్ల తేడాతో గెలుపొందారు. వరల్డ్ కప్ టోర్నీల్లో జ్యోతికి ఇది 9వ స్వర్ణ పతకం కావడం విశేషం. రిషబ్‌కు ఇది తొలి వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు, టోర్నీలో భారత్‌కు ఇది తొలి బంగారు పతకం కావడం గమనార్హం. మొత్తంగా రెండోవది.
ఒలింపిక్స్ లో చాన్స్..ఒలింపిక్స్ లో పతకం గెలవడమనేది క్రీడాకారుల లైఫ్ టైమ్ గోల్. ఆర్చరీలోని ఒక విభాగం క్రీడాకారులకు ఈ కల నిజంక కాబోతోంది. ఇన్నాళ్లుగా ప్రాతినిథ్యం లేని, కాంపౌడ్ విభాగాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో తెలుగమ్మాయి అమ్మాయి కల నిజం కాబోతోంది. ఒలింపిక్స్ లో ఆడాలనే డ్రీమ్ కోసం కష్టపడుతున్న ఈ తెలుగు ఆర్చర్ కు ఆ ఛాన్స్ దక్కనుంది. లాస్ ఏంజిల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీకి ఎంట్రీ దొరకడమే ఇందుకు కారణం కావడం విశేషం. కొన్నేళ్లుగా భారత కాంపౌండ్ ఆర్చరీ యోధురాలిగా గా సాగుతున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఒలింపిక్స్ డ్రీమ్ నిజం అవనుంది. . లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ఈవెంట్ చేర్చడమే ఇందుకు కారణం కానుందిని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంపౌండ్ ఆర్చరీలో పోటీపడే సురేఖ.. ఇన్ని రోజులూ ఒలింపిక్స్ లో ఈ విభాగం లేకపోవడంతో నిరాశ చెందినట్లు చాలా సార్లు పేర్కొంది. తాజా మార్పుతో ఆమె కూడా ఒలింపిక్స్ లో పాల్గొననుంది.