Inter Advanced Supplementary Exams: ఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 12 నుండి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసేవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది. జనరల్‌ కోర్సులకు పరీక్ష ఫీజు రూ.510 రూపాయలుగా నిర్ణయించారు. అదే ఓకేషనల్‌ కోర్సులకు రూ.720గా నిర్ణయించారు. ఇంప్రూమెంట్‌ పరీక్ష రాసే అభ్యర్ధులు, అర్ట్స్‌ విద్యార్ధులకు పరీక్ష ఫీజును రూ.1,230గా, సెన్స్‌ విధ్యార్ధులకు రూ.1430గా నిర్ణయించారు.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూలు..➥  మే 12న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1➥  మే 13న ఇంగ్లిష్‌ పేపర్‌-1➥  మే 14న మ్యాథమెటిక్స్-1ఎ, బోటనీ పేపర్‌-1, సివిక్స్‌-పేపర్‌-1 పరీక్షలు. ➥  మే 15న మ్యాథ్స్‌-1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1 పరీక్షలు. ➥  మే 16న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనమిక్స్‌ పేపర్‌-1 పరీక్షలు.  ➥  మే 17న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, సోషియాలజీ పేపర్‌-1, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-1 పరీక్షలు. ➥  మే 19న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, లాజిక్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌-1 (బైపీసీ విద్యార్థులకు). ➥  మే 20న మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలు  

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూలు..➥ మే 12న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2.➥  మే 13న ఇంగ్లిష్‌ పేపర్‌-2.➥  మే 14న మ్యాథమెటిక్స్-2ఎ, బోటనీ పేపర్‌-2, సివిక్స్‌-పేపర్‌-2. ➥  మే 15న మ్యాథ్స్‌-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2. ➥  మే 16న ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనమిక్స్‌ పేపర్‌-2.  ➥  మే 17న కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2, సోషియాలజీ పేపర్‌-2, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2. ➥  మే 19న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, లాజిక్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌-2 (బైపీసీ విద్యార్థులకు). ➥  మే 20న మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జాగ్రఫీ పేపర్‌-2.

ఎగ్జామ్ ఫీజు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ వివరాలు..ఇంటర్ ఫలితాలకు సంబంధించి.. విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోస ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. 

మే 28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 28 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. 

➥ విద్యార్థులకు జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, జూన్ 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.