Just In





AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి
AP Inter Results 2025 | ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఏపీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు రిలీజ్ చేశారు.

BIEAP Results 2025 | ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతేడాదికి భిన్నంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా ఫలితాలు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో, ఏబీపీ దేశం వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకునేందుకు వీలుంది. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్ పొందవచ్చు. ఏడాది సరిపోతా టెక్నాలజీతో వాట్సాప్ లోనే ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. వాట్సాప్ మనమిత్ర నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు పొందవచ్చు.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్టియర్ విద్యార్థులు 70% శాతం పాస్ కాగా, రెండో సంవత్సరం విద్యార్థులు 83% పాస్ అయ్యారని నారా లోకేష్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ లో 4,22,030 మంది జనరల్ విద్యార్థులు హాజరుకాగా, 3,51,521 మంది పాసయ్యారు. ఒకేషనల్ విద్యార్థులలో 33,289 మంది ఎగ్జామ్ రాయగా, 25,707 మంది పాసయ్యారు. ఇంటర్ సెకండియర్ లో 83 శాతం విద్యార్థులు పాస్ కాగా, ఒకేషనల్ విద్యార్థులలో 77 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది 26 జిల్లాల్లో మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులకుగానూ 10 లక్షల 17 వేల 102 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మార్చి 3 నుండి 20వ తేదీ వరకూ సెకండియర్ పరీక్షలు, మార్చి 1నుండి 19 వరకూ ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మూడు వారాల్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ విద్యాశాఖ, ఇంటర్ బోర్డు కసరత్తు చేశాయి. నిర్ణీత గడువుకు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.