T2o World Cup 2024 India Squad :వరల్డ్ కప్‌ ఆడేందుకు బీసీసీ ప్రకటించిన టీమిండియాలో సన్‌రైజర్స్ మిస్ అయింది. ఐపీఎల్‌లో ఉండే హైదరాబాద్‌ వరల్డ్‌ కప్‌లో ఎందుకనే ఆలోచన అక్కర్లేదు. టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఏ ఒక్క  SRH ప్లేయర్ కూడా ఎంపిక కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. అందుకే NO SRH అంటున్నారు.


ముంబయి ఇండియన్స్ తరపున రోహిత్, హార్దిక్,సూర్య కుమార్, బుమ్రాలు ఉన్నారు. రాజస్థాన్ తరపున సంజూ శాంసన్,యశస్వీ, చాహల్, అవేశ్ ఖాన్ లు. దిల్లీ నుంచి పంత్, కుల్దీప్ యాదవ్,ఖలీల్ అహ్మద్,అక్సర్ పటేల్. చెన్నై నుంచి జడేజా, శివమ్ దూబే. ఆర్సీబీ నుంచి కోహ్లీ, సిరాజ్, పంజాబ్ నుంచి అర్ష్ దిప్ సింగ్, కేకేఆర్ నుంచి రింకూ సింగ్, గుజరాత్ నుంచి గిల్ సెలెక్ట్ అయ్యారు.


ఈ లిస్ట్ లో లక్నో సూపర్ జెయింట్స్ గానీ సన్ రైజర్స్ హైదరాబాద్ గానీ లేదు. LSG నుంచి రాహుల్ సెలెక్ట్ కావాలి కానీ తృటిలో మిస్ ఐంది. కానీ..SRH నుంచి ఏ ప్లేయర్ ను కూడా కన్సిడర్ చేయలేదు. కారణం.. టీం ఇండియా సెన్సెషన్ ఒక్కడు కూడా SRHలో లేడు. అభిషేక్ శర్మ అదరగొడుతున్నా..ఇంకా ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నితిశ్ రెడ్డి, సమ్మద్, షాబాద్ అహ్మద్ కంటిస్టెన్సీ మెయిన్‌టెన్ చేయాల్సి ఉంది. ఫస్ట్ నార్మల్ సిరీస్ లకు ఎంపిక అవ్వాల్సిన పని ఉంది. ఇక భువనేశ్వర్ అవుట్ డేటేడ్ అయ్యాడు.నటరాజన్ ను కూడా పట్టించుకోవట్లేదు బీసీసీఐ.


సరే..ఇది ఆయా ఆటగాళ్ల వ్యకిగత ప్రదర్శన అనుకుంటే.. SRH టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది. ముంబయికి రోహిత్, చెన్నైకి ధోని, ఆర్సీబీకి కోహ్లీ, దిల్లీకి పంత్ ఇలా ఒక్కో టీమ్ కు ఒక్కో ఇండియన్ స్టార్ ప్లేయర్ ఉన్నాడు.SRHలో మాత్రం ఏ స్టార్ ప్లేయర్ లేడు. అప్పట్లో ధావన్ ఒక్కడే ఉండేవాడు కానీ అతడికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఐతే వార్నర్, కేన్ విలియమ్ సన్ లెటెస్ట్ గా 20 కోట్ల ప్లేయర్ కమిన్స్. ఇలా అందరు విదేశీ ఆటగాళ్లనే కొంటున్నారు తప్ప ఇండియన్ యంగ్ టాలెంట్స్ ను కూడా కొనుక్కోవట్లేదు. అందుకే..SRHనుంచి ఎవరు టీం ఇండియాకు పెద్దగా సెలెక్ట్ అవ్వట్లేదు.


ఐపీఎల్ అంటే డబ్బుల వేట. డబ్బులు పెట్టి సూపర్ ప్లేయర్స్ ని కొంటాం లోకల్ ప్లేయర్స్ తో సంబంధం ఏంటీ అనుకోవ్చచు గానీ, అలా చూసుకున్నా... లోకల్ స్టార్ ప్లేయర్స్ లేకపోవడం వల్ల  SRH బ్రాండ్ వాల్యూ అంతంత మాత్రంగానే ఉంది. యాడ్స్ తక్కువగా వస్తున్నాయి. ప్రమోషన్స్, జెర్సీలపై లోగోలు ఇలా అన్నింట్లో SRH వెనుకపడిపోతుంది. అటు యంగ్ టాలెంట్ ని దేశానికి ఇవ్వకుండా.. ఇలా బ్రాండ్ వాల్యూని పెంచుకుకోండా కావ్య మేడమ్ ఏం చేస్తున్నారో ఆమెకే తెలియాలి.