Vaibhav Suryavanshi In Ipl 2025: వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. ఓపెనింగ్ వచ్చి జైస్వాల్‌తో కలిసి జట్టుకు మంచి శుభారంభంం అందించాడు. 

వైభవ్ సూర్యవంశీ 27 మార్చి 2011లో జన్మించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌. స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలింగ్ కూడా చేయగలడు. క్రికెట్‌పై మక్కువ ఉండే తండ్రి ఇతన్ని నాలుగేళ్ల నుంచే ప్రోత్సహించడం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసులో సమస్తిపూర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. 

12 ఏళ్లకే దుమ్మురేపిన సూర్యవంశీ

దేశీయ క్రికెట్‌లో వైభవ్‌ చాలా రికార్డు సృష్టించారు. 12 ఏళ్ల వయసులోనే బిహార్‌ అండర్‌ -19 జట్టు తరఫున వినూ మంకాడ్ ట్రోఫీలో ఆడాడు. తర్వాత గతేడాది జనవరిలో కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో ఆడాడు. బిహార్ తరఫఉన ఫస్ట్‌ క్లాస్ క్రికెట్ ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇలా చిన్న వయసులో రంజీ ఆడిన నాల్గో క్రికెటర్‌గా నిలిచాడు. గతేడాది చిన్న వయసులోనే లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆడిన యంగర్‌గా మారాడు. 

అండర్‌ -19లో రికార్డు 2023లో ఇండియన్ బీ అండర్‌ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు ఇన్నింగ్స్ఆడి రెండు శతకాలు సాధించారు. మొత్తం ఆరు మ్యాచ్‌లలో 177 పరుగులు చేశాడు. గతేడే అండర్‌ -19 అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 58 బంతుల్లో శతకం బాదాడు. ఇది అండర్ -19లో అత్యంత ఫాస్టెస్ట్‌ సెంచరీ. ఆ ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. 2024లో ACC అండర్ -19 ఆసియా కప్‌లో యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 

వైభవన్ ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్‌ 13 ఏళ్ల వయసులోనే టీంలోకి తీసుకుంది.కోటీ పది లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇవాళ(19ఏప్రిల్‌ 2025)న లక్నో సూపపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడిపించింది. దీంతో ఐపీఎల్‌లో ఆడిన అతి చిన్న వయసు క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు వైభవ్ 

వైభవ్ వయసుపై ఆరోపణలు వైభవ్ సూర్యవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2023లోనే తనకు 14 ఏళ్లు వచ్చినట్టు చెప్పాడు. అంటే రికార్డుల్లో ఉన్న వయసు కంటే ఏడాదిన్నర ఎక్కువ దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన తండ్రి సంజీవ్‌... తన కుమారుడి బీసీసీఐ బోన్ టెస్టు నిర్వహించిందని అందులో కూడా అతని అసలు వయసు తెలిసిందని చెప్పారు. ఇప్పుడు కూడా మరోసారి పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఏదో కన్ఫ్యూజ్‌లో వైభవ్ పొరపాటుగా అలా చెప్పాడని వివరణ ఇచ్చారు. వైభవ్ వయసుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ జునైద్‌ ఖాన్ కూడా విమర్శలు చేశాడు.అన్నింటినీతండ్రి ఖండించారు. 

లక్నో సూపర్ జెయింట్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్‌  20 బంతులు ఆడి 34 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.  అప్పటి వరకు ధాటిగా ఆడుతున్న వైభవ్‌, మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత వెళ్లిపోతూ చెమ్మగిల్లే కళ్లను తుడుచుకున్నాడు. సరిగా ఆడలేదని భావోద్వేగానికి గురైనట్టు సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి.