ఐపీఎల్ 2026లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితంతో అర్షదీప్ వార్తల్లో నిలిచాడు. క్రికెటర్ ఒక అమ్మాయి చేయి పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమానులు చేతిపై టాటూ, గోళ్లపై ఉన్న ఆర్ట్ గుర్తించి, ఆమె మరెవరో కాదు సమ్రీన్ కౌర్ అని చెబుతున్నారు. ఇక అది మొదలుకుని అర్షదీప్, సమ్రీన్ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

Continues below advertisement

అర్ష్‌దీప్ సింగ్ షేర్ చేసిన ఫోటోలలో తను ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు. కానీ అందులో ఆమె ముఖం కనిపించడం లేదు. అమ్మాయి చేతిపై చిన్న టాటూ మాత్రం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అభిమానులు ఈ టాటూతో అమ్మాయి ఎవరని గుర్తించారు. ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని చెబుతున్నారు. క్రికెటర్ ఫోటోలో అమ్మాయి చేతిపై ఉన్న టాటూ, చేతిపై ఉన్న టాటూ ఒకేలా ఉన్నాయని  అంటున్నారు.

PBKS కి సమ్రీన్ కౌర్ మద్దతు 

ఆ తర్వాత సమ్రీన్ కౌర్ IPL మ్యాచ్‌లు చేసేందుకు స్టేడియానికి రాగా.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఐపీఎల్ టైం ఫొటో కాదని, గత ఏడాది తీసిన ఫోటోస్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

ఎవరీ సమ్రీన్ కౌర్.. 

పంజాబీ సినీ పరిశ్రమలో ఎదుగుతున్న నటి సమ్రీన్ కౌర్. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్ ప్రపంచ కప్ 1983 విజయంపై తీసిన 83 సినిమాలో నటించింది. 

సమ్రీన్ కౌర్ 2021లో జమ్మూ కాశ్మీర్‌లో పుట్టింది. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ కంటే వయసులో ఒక ఏడాది చిన్న. సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన నెటిజన్స్ వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని కామెంట్ చేయడంతో విషయం వైరల్ అయింది. అయితే వారి మధ్య రిలేషన్ గురించి జరుగుతున్న ప్రచారంలో అర్షదీప్, సమ్రీన్ కూడా రియాక్ట్ కాలేదు.