RCB Impress When Virat Made T20 Debut: ఐపీఎల్ ప్రారంభానికి కంటే ముందే బిసిసిఐ ఒక ఎక్స్‌పెరిమెంటల్ డొమెస్టిక్ టి20 టోర్నమెంట్ నిర్వహించింది. ఉనాలోని హిస్టారిక్ ఇందిరా గాంధీ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరఫున 18 ఏళ్ల విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. ప్రెజెంట్ కోహ్లీ బ్యాటింగ్ కి వస్తే స్టేడియంలో ఒక్క సీటు ఖాళీగా ఉండదు, కానీ 19 ఏళ్ల క్రితం అతడు టి20 ఫార్మాట్ డెబ్యూ చేసినప్పుడు మ్యాచ్ చూడటానికి ఫ్యాన్స్ కూడా లేరు.

Continues below advertisement

Continues below advertisement

సీనియర్ బౌలర్లను తట్టుకుని నిలిచిన యంగ్ కోహ్లీ.. యాంకర్ ఇన్నింగ్స్ట్రిక్కీ పిచ్ పై సీనియర్ డొమెస్టిక్ బౌలర్లను ఫేస్ చేస్తూ ఢిల్లీ ఎర్లీగా వికెట్లు కోల్పోయింది. నంబర్ 3 లో వచ్చిన కోహ్లీ మైండ్ అప్లై చేసి 26 బంతుల్లో 35 రన్స్ చేసి యాంకర్ రోల్ ప్లే చేశాడు. మిగిలిన బ్యాటర్లు కష్టపడుతున్న టైమ్ లో సిక్స్ లు, ఫోర్ల కోసం గ్రౌండ్ షాట్లు కొట్టకుండా వికెట్ల మధ్య పరిగెత్తడం, గ్యాప్స్ వెతకడం ద్వారా మ్యాచ్ గెలవచ్చని కోహ్లీ ప్రూవ్ చేశాడు. శిఖర్ ధావన్ (28 బంతుల్లో 38) తర్వాత టీమ్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్ గా విరాట్ నిలిచాడు. హిమాచల్ బౌలర్ నిశ్చల్ గౌర్ 4 వికెట్లు తీయడంతో ఢిల్లీ 136 రన్స్ కి ఆలౌట్ అయింది.

హిమాచల్ ప్రదేశ్ విక్టరీ.. కెప్టెన్ సందీప్ శర్మ హాఫ్ సెంచరీ నాక్137 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హిమాచల్ జస్ట్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ సందీప్ శర్మ 44 బంతుల్లో 45 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచి టీమ్ ని గెలిపించాడు.

2008 ఐపీఎల్ ఆక్షన్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బిగ్ మిస్టేక్వన్ ఇయర్ తర్వాత 2008 లో జరిగిన ఫస్ట్ ఐపీఎల్ డ్రాఫ్ట్ లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ లోకల్ కిడ్ కోహ్లీని వదిలేసి, అండర్-19 హైప్ చూసి ప్రదీప్ సంగ్వాన్ ను పిక్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ టాలెంట్ స్కౌట్స్ కోహ్లీ అడాప్టబిలిటీని గుర్తించి తక్కువ ప్రైస్ కి సొంతం చేసుకున్నారని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.