Virat Kohli Teasing : మ్యాచ్ లు వరుసగా ఓడిపోతూ బీభత్సమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆర్సీబీ(RCB) ఫ్యాన్స్ ను కాస్త లైట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ(Virat Kohli). నిన్న కోల్ కతా(KKR) తో జరిగిన మ్యాచ్ లో అందరినీ ప్రాంక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ ప్లేయర్లంతా గ్రౌండ్‌లోకి వచ్చేశారు. కోల్ కతా ముందు బ్యాటింగ్ కి దిగగా ఫస్ట్ ఓవర్ తనే వేస్తున్నట్లు అంపైర్ దగ్గరకి వెళ్లి క్యాప్ ఇచ్చాడు కోహ్లీ . ఆ తర్వాత రనప్ ప్రాక్టీస్ చేసి క్రీజులోకి వస్తున్న నరైన్ ముందుకు వెళ్లి పుష్ప స్టైల్ లో తగ్గేదే లే అంటూ బిల్డప్ ఇచ్చాడు. నరైన్ కొహ్లీ బౌలింగ్ చేస్తున్నాడని చూసి పెద్దగా నవ్వేశాడు. ఐ విల్ కిల్ యూ అంటూ నరైన్ ముందు బిల్డప్ ఇచ్చిన కొహ్లీ తర్వాత అంపైర్ దగ్గరికి వచ్చి క్యాప్ తీసేసుకున్నాడు. సో ఇదంతా ప్రాక్ చేశాడని అర్థం చేసుకున్న అంపైర్లు కూడా నవ్వుకున్నారు.
మ్యాచ్ కి ముందు కొహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయటంతో నిజంగానే బౌలింగ్ వీక్ అనిపించుకుంటున్న ఆర్సీబీకి బౌలింగ్ లోనూ కొహ్లీ హెల్ప్ అవుదామనుకుంటున్నాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇదంతా జస్ట్ జోక్ గా చేశాడు కొహ్లీ. కానీ కొహ్లీ జోక్ సీరియస్ గా తీసుకున్న కోల్ కతా 222రన్స్ తో ఇచ్చి పడేసింది. ఆఖరు వరకు జరిగిన మ్యాచ్‌లోకోల్‌క తా చివరి బంతికి గెలుపొందింది.
చేతిదాకా వచ్చిన మ్యాచ్ చేజారడంతో బెంగళూరు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఈ ఐపీఎల్‌లో రెండో విజయం నమోదు చేస్తామని భావించిన వేళ అనూహ్య ఓటమితో బెంగళూరు జట్టు, అభిమానులు నిర్వేదంలో మునిగిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. కోహ్లీ అవుటైన బంతి నో బాల్ అని... అయినా విరాట్ వెనుదిరగడంతోనే ఒక్క పరుగుల తేడాతో ఓడిపోయామని బెంగళూరు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. క్రీజులో కోహ్లీ ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. ఇంతకీ కోహ్లీ ఆడిన బంతి నో బాలా కాదా అనే చర్చ కూడా ప్రారంభమైంది.