IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభమైనప్పుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపైనే అత్యధిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే వారు డిఫెండింగ్ ఛాంపియన్లు, ట్రోఫీని విజయవంతంగా కాపాడుకోవడం ఏ క్రీడలోనైనా అత్యంత సవాలుతో కూడుకున్న టాస్క్‌లలో ఒకటి. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో, బెంగళూరు వరుసగా రెండోసారి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారి మొదటి మ్యాచ్ మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది. ఈసారి ఆర్‌సిబికి ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకోగల ముగ్గురు ఆటగాళ్లను ఇక్కడ చూద్దాం.

Continues below advertisement

ముందుగా చెప్పుకోదగ్గ పేరు విరాట్ కోహ్లీ. ఈ తరం అత్యంత టాలెంటెడ్‌ బ్యాట్స్‌మన్‌ ఏం చేయబోతున్నాడనే అందరు ఆసక్తిగా చూస్తున్నారు.  ఓపెనింగ్‌లో వేగంగా ఆరంభించడం, మధ్య ఓవర్లలో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లడం, లేదా డెత్ ఓవర్లలో మ్యాచ్‌ను ముగించడం వంటి ఏ పరిస్థితి నుంచైనా మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో అతనికి బాగా తెలుసు. అందుకే ఈ సీజన్‌లో విరాట్ ఆటతీరుప ఎలా ఉంటుందనే లెక్కలు వెసుకుంటున్నారు అభిమానులు. 

ఐపీఎల్ 2025లో, అతను ఎనిమిది అర్ధ సెంచరీలతో సహా 657 పరుగులు చేశాడు. తన కెరీర్ మొత్తంలో 8,661 పరుగులు సాధించిన అతను, 2016లో 973 పరుగులు చేసిన తన ప్రదర్శనను పునరావృతం చేయగల సత్తా కలిగి ఉన్నాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ అదే పేరిట ఉంది.

Continues below advertisement

ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2025లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అతను ఆ సీజన్ మొత్తంలో 13 మ్యాచ్‌లలో 403 పరుగులు చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో అతనికి అంతగా కలిసి రాలేదు, కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో తిరిగి బరిలోకి దిగుతున్నాడు. సాల్ట్ బ్యాట్ ఒకసారి ఫామ్‌లోకి వచ్చింది అంటే మాత్రం ప్రత్యర్థులకు చుక్కలే. అంపైర్లు ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయాల్సిందే. ఇదే సాల్ట్, ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై 27 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి, బెంగళూరును నేరుగా ఫైనల్‌కు చేర్చాడు.

తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా కేకేఆర్ కాకుండా వేరే జట్టు తరఫున ఆడనున్న వెంకటేష్

అయ్యర్‌పై అందరి దృష్టి ఉంటుంది. మినీ-వేలంలో బెంగళూరు జట్టు అయ్యర్‌ను ₹7 కోట్లకు దక్కించుకుంది. ఆర్‌సీబీ జట్టు కూర్పును బట్టి చూస్తే, అయ్యర్‌కు మిడిల్ ఆర్డర్‌లో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. తన 62 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 1,468 పరుగులు చేసిన అయ్యర్, ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఒక ప్రధాన ఎక్స్-ఫ్యాక్టర్‌గా నిరూపించుకోగలడు.