MI vs RCB Match Highlights : చేస్తే డకౌట్ చేయండి లేదంటే దండయాత్ర చేసి చూపిస్తా..! ఈ లైన్ సూర్య కుమార్ యాదవ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. నిన్న జరిగిన ముంబయి వెర్సస్ బెంగళూరు మ్యాచులో మనోడి విధ్వంసం ఆ రేంజ్‌లో సాగింది మరి. 19 బాల్స్ లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు కొట్టాడు. సూర్య దెబ్బకు 197 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ టీమ్ 15.3 ఓవర్లలోనే ఛేజ్ చేసి పారేసింది.


నార్మల్ గా 19 బాల్స్‌లో 52 పరుగులు కొడితే పవర్ ప్లే లో లేదంటే డెత్ ఓవర్స్ లో కొడతారు. సూర్య కుమార్ యాదవ్ మాత్రం 9-13 ఓవర్స్ మధ్యలో కొట్టాడు. పవర్ ప్లే ముగిసిన తరువాత 7-15 ఓవర్లు అత్యంత కీలకం. ఈ సమయంలో వికెట్ కాపాడుకుంటునే స్కోర్ స్పీడ్ ను పెంచాలి. అందరు బ్యాటర్లు ఇదే ఫాలో అవుతారు.






సూర్య కుమార్ యాదవ్‌కు మాత్రం ఈ లెక్కలేవి తెలీదు. బాల్ పడిందా...స్టాండ్స్‌కు  పంపామా అన్నదే లెక్క. అందుకే నిన్న సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అతడి వల్లే టార్గెట్ ఛేజ్ ఈజీ ఐంది లేకుంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ జరిగేది.






సూర్య కుమార్ యాదవ్ గత 3 నెలల్లో 3 సార్లు గాయపడ్డాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన సూర్య... ఆ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఆ ఒక్క మ్యాచే కాదు మనోడు కొడితే హాఫ్ సెంచరీ లేదంటే డకౌట్ అన్నట్లుగా ఆడేస్తుంటాడు. అందుకే డీసీ మ్యాచులో డకౌట్ ఐనప్పటికీ.. ఆర్సీబీపై మాత్రం విశ్వరూపం చూపించాడు. దీంతో.. సూర్య స్టార్టింగ్ లోనే ఛాన్స్ ఇస్తాడు అప్పుడే వికెట్ తీసుకోవాలి. ఒక్కసారి ట్రాక్ ఎక్కడా...! ఉన్న కొంత సేపట్లోనే మ్యాచ్ గెలుపునే టర్న్ చేసి చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.