Pat Cummins For SRH: ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వ్యూహాత్మకంగా వ్యవరించిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మాములుగా ఒక ఆటగాడిపై కోట్లకు కోట్లు గుమ్మరించని సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్‌పై ఏకంగా రూ 20.5 కోట్లు కుమ్మరించింది. ఇది అభిమానులను కాస్త షాక్‌కు గురి చేసింది. అయితే గత సీజన్‌కు ముందు వేలంలో హ్యారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు చెల్లించి అందర్నీ ఆశ్చర్యపరిచిన సన్‌రైజర్స్.. ఈసారి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసి అందరూ అవాక్కయేలా చేసింది. అయితే కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అనుభవజ్ఞుడైన స్పిన్నర్ దొరకడంతో పాటు కెప్టెన్ కూడా దొరికేశాడు. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాకు అందించిన కమిన్స్ ఈసారి సన్‌రైజర్స్‌కు ఐపీఎల్ కప్ అందిస్తాడని హైదరాబాద్ ప్రాంచైజీ నమ్మకంతో ఉంది.
పాట్ కమిన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్.... ట్రావిస్ హెడ్‌ను రూ.6.8 కోట్ల ధరకు.. హసరంగను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో పలికిన ధరతో పోలిస్తే.. హసరంగ చాలా తక్కువ ధరకు సన్‌రైజర్స్ సొంతమయ్యాడు. దీంతో కమిన్స్‌కు భారీ ధర చెల్లించేందుకు సన్‌రైజర్స్‌కు అవకాశం దొరికింది. సన్‌రైజర్స్ ఓ వ్యూహం ప్రకారమే ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పటికే హెడ్, హసరంగను తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో.. కమిన్స్ కోసం ఎక్కువ ధర పెట్టే అవకాశం లభించిందని.. కమిన్స్‌ను సొంతం చేసుకోవడం వల్ల మంచి ఫాస్ట్ బౌలర్‌తోపాటు కెప్టెన్ కూడా లభించాడనేది కొందరి అభిప్రాయం. వచ్చే సీజన్‌కు ముందు ఎలాగో మెగా వేలం ఉండటంతో.. ఈ ఏడుగురు ఓవర్సీస్ ఆటగాళ్ల నుంచి ఒకర్ని మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా వాళ్లను రిలీజ్ చేస్తారని.. కానీ ఈ సీజన్‌కు జట్టు బలంగా ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తళుకున్న మెరిసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తో ఆశ్చర్యపరుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్‌తో కలిసి కావ్య మారన్ వేలంలో పాల్గొంది. వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అతడిని దక్కించుకునేందుకు చెన్నై, సన్‌రైజర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.6.80 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ట్రావిస్ హెడ్ సొంతమైన అనంతరం కావ్య మారన్ చిరునవ్వులు చిందించింది. ఆమె నవ్వుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తరువాత శ్రీలంక ఆల్‌రౌండర్ వానింద్ హసరంగా వేలంలోకి వచ్చాడు. అతడి బేస్ ప్రైజ్ రూ.కోటి కాగా.. రూ.1.5 కోట్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసింది.తక్కువ మొత్తానికి హసరంగ దక్కడంతో కావ్య మారన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.