SRH Team Analysis In IPL 2025: సన్ రైజర్స్.. గతేడాది టోర్నీ అంత‌టా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పేరింది. విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టించిన ఎస్ఆర్ హెచ్ ఈ ఏడాది త‌న టీమ్ ను మ‌రింత ప‌టిష్టం ప‌రుచుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్, అభిన‌వ్ మ‌నోహ‌ర్ రాక‌తో మిడిలార్డ‌ర్ మ‌రింత ప‌టిష్టంగా మారింది. అలాగే బౌలింగ్ కూడా రాటుదేలింది. వెట‌ర‌న్ మ‌హ్మ‌ద్ ష‌మీ, ఆడ‌మ్ జంపా, హ‌ర్ష‌ల్ ప‌టేల్, రాహుల్ చ‌హ‌ర్‌, జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ త‌దిత‌ర బౌల‌ర్ల‌ను తీసుకుని మ‌రింత ప‌టిష్టంగా మారింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప‌రుగుల సునామీ కురిపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ జంట ఫియ‌ర్లెస్ బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్కలు చూపించాల‌ని కోరుకుంటున్నారు. గ‌తేడాది వీళ్లిద్ద‌రి బ్యాటింగ్ తో చాలాసార్లు జ‌ట్టు 250 ప‌రుగుల‌ను అల‌వోక‌గా సాధించింది. ఈసారి వీరి జోరు కొన‌సాగించాల‌ని ఆశిస్తున్నారు. వ‌న్ డౌన్ లో ఇషాన్ కిషాన్ రాక‌తో బ్యాటింగ్ బ‌లం మ‌రింత‌గా పెరిగింది. విధ్వంస‌క‌ర ఆట‌కు పెట్టింది పేరైనా, చోటా డైనమెట్ ఇషాన్.. విజృంభించాల‌ని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆల్రెడీ ఇంట్రా స్క్వాడ్ పోటీల్లో త‌న త‌డాఖా చూపించాడు. 

ప‌టిష్ట‌మైన మిడిలార్డ‌ర్..నెం.4లో తెలుగు ప్లేయ‌ర్ నితీశ్ రెడ్డి ఆడ‌తాడు. ఆల్ రౌండ‌ర్ గా త‌ను ఎంత ప్ర‌భావం చూప‌గ‌ల‌డో గ‌తేడాది నిరూపించాడు. ఇక టీ20ఐ, టెస్టుల్లో స‌త్తా చాట‌డంతో త‌న ఆత్మ విశ్వాసం హైలో ఉంది. అయితే గాయంతో నెల‌పాటు క్రికెట్ కు దూరంగా ఉండ‌టం మైన‌స్ పాయింట్ అయినా, ప్రాక్టీస్ తో దాన్ని అధిగ‌మించ‌గ‌ల‌డు. నె0.5లో హెన్రిచ్ క్లాసెన్ ఆడ‌తాడు. అత‌ని గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. నిలుచున్న చోటునుంచే అల‌వోక‌గా సిక్సులు కొట్ట‌డంలో దిట్ట‌.. అభిన‌వ్ మ‌నోహ‌ర్ కు హిట్ట‌ర్ గా మంచి పేరుంది. ఇక అధ‌ర్వ తైడే, స‌చిన్ బేబీ త‌దిత‌రుల‌ను కూడా ప్రయోగించి చూడొచ్చు. 

ష‌మీ నిల‌క‌డ‌గా ఆడాలి..కాస్త ఫిట్ నెస్ స‌మస్య‌లు ఎదుర్కొంటున్న ష‌మీ.. ఈ టోర్నీలో స‌త్తా చాటాలి. అయితే టోర్నీ ముగిశాక‌, కీల‌క‌మైన ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఉండటంతో మ‌ళ్లీ ఫిట్నెస్ స‌మస్య‌లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త టీమ్ మేనేజ్మెంట‌ప్ పై ఉంది. కెప్టెన్ పాట్ క‌మిన్స్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ఉనాద్క‌ట్, రాహుల్ చ‌హ‌ర్, జంపాల‌తో బౌలింగ్ ప‌టిష్టంగా ఉంది. వీలును బ‌ట్టి, జ‌ట్టు కూర్పు ఉండ‌వ‌చ్చు. ఇక గ‌తేడాది ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో ఫైన‌ల్ కు వ‌చ్చి, తుస్సుమ‌నిపించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి మాత్రం ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌ని అంద‌రూ భావిస్తున్నారు.గ‌తంతో పోలిస్తే ఈసారి మ‌రింత స‌మ‌తూకంగా క‌నిపిస్తున్న జ‌ట్టు ఐపీఎల్లో త‌మ రెండో టైటిల్ ను ఒడిసి ప‌ట్టాల‌ని పులువురు కోరుకుంటున్నారు.  స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ స్క్వాడ్:  పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, బ్రైడన్ కార్స్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఈషన్ మలింగ, సచిన్ బేబీ.