Shreyas Iyer’s Fiery IPL Form: ఈ IPL సీజన్‌లో అన్‌బీటబుల్ జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్-PBKS. వాళ్ల మీద మ్యాచ్ అంటే ఇక ఆ పాయింట్లను దేవుడికిచ్చువోవాల్సిందే అన్నట్లుగా అయిపోయాయి మిగతా టీమ్‌లు. ఆ జట్టును ఆస్థాయిలో నిలబెట్టిన ఆటగాడు.. శ్రేయస్ అయ్యర్. పదేళ్ల కెరీర్‌లోనే రెండుసార్లు తాను లీడ్ చేసిన జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లి... ఓసారి కప్ గెలిచిన కెప్టెన్ అతను. CSK, MI వంటి టీమ్‌లు చాలా సీజన్‌లు గెలిచాయి ఇందులో గొప్పేం ఉందనుకోవద్దు. అందులో లేని పవర్ ఇక్కడ ఉంది. ఆ వవర్‌ను జట్టుకు ఇస్తోంది శ్రేయస్ అయ్యర్. ఓ టాప్‌క్లాస్ ఆటగాడినైన తనను టీమిండియా T20కి తీసుకోవడం లేదన్న కోపం.. సెలక్టర్లు పట్టించుకోవడం లేదన్న కసి అతని ఆటతీరులో కనిపిస్తోంది. అదే కసి ఆ టీమ్‌లో కనిపిస్తోది. 

Continues below advertisement

ఇండియాకు తీసుకోరా..? అయితే నేనేంటో చూపిస్తా అంటున్న శ్రేయస్

ప్రతీమ్యాచ్‌లో గెలవాలన్న కసి.. తానేంటో చూపించాలన్న పట్టుదల శ్రేయస్  ఆటలో కనిపిస్తోంది. IPL 2026లో అతను లీడ్ చేస్తున్న PBKS Unbeatableగా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఓ మ్యాచ్‌లో రిజల్ట్ రాకపోయినా.. ఆ మ్యాచ్‌లో PBKS డామినెన్స్ చూపించింది నిజం. 2024కు ముందు గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్ టీమిండియాకు అందుబాటులోకి రాలేదు. అయితే ఆ వెంటనే IPL ఆడాడు. IPL కి ప్రిపేర్ కావడం కోసం టీమిండియాకు దూరంగా ఉన్నాడన్న విమర్శలు వచ్చాయి. కారణమేదైనా ఆ తర్వాత అతను టీమిండియకు T20, టెస్టుల్లో ఆడలేదు.  2023 డిసెంబర్ తర్వాత.. అతను T20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ ఆడలేదు. మధ్యలో వన్డే సిరిస్‌కు తీసుకున్నా.. అది ఒక ఆప్షన్‌గా మాత్రమే. సరే ఏ IPL కోసం ఆాడాడో వాళ్ల నుంచి కూడా చేదు అనుభవమే ఎదురైంది. 2024లో  KKRకి కప్‌ అందిస్తే.. వాళ్లు వెంటనే  వదిలేశారు..  ఆ  కోపంతో 2025 లో PBKSలో చేరి  రెచ్చిపోయి ఆడాడు.. టీమ్‌ను కూడా అద్భతంగా లీడ్ చేసి ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ దురదుష్టం వెన్నాడింది. ఇక అప్పటి నుంచి తనను ప్రూవ్ చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తోంది. టీమిండియా జెర్సీ లేకపోయినా…క్రికెట్ మైదానంలో ఒక ప్లేయర్ ఎలా సమాధానం చెబుతాడో చూపిస్తున్నాడు Shreyas. 

Continues below advertisement

'ఇది కేవలం తన ఫామ్‌ను ప్రూవ్‌ చేయడం కాదు.. ఇది ఒక స్టేట్మెంట్!' 'నన్ను పట్టించుకోలేదా… సరే…ఇప్పుడు చూడండి నేను ఏంటో చూపిస్తా అని చెప్పడం!'

అది తనను వదిలేసిన KKRకు, తనను పట్టించుకోని టీమిండియా సెలక్టర్లకు చెప్పేమాట..!

ఓ మాస్ సినిమా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే.. "మరీ ఇలా ఉన్నావేంట్రా?" అని ఫ్యాన్స్ అనుకోలా ఉంది. 

అందనంత ఎత్తులో PBKS

ఈ సీజన్‌లో PBKSను అతను ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లి పెట్టాడు. అతని టీమ్‌లోని కుర్రాళ్లు ఎలాంటి టార్గెట్ ఇచ్చినా ఇచ్చి పడేస్తున్నారు..  265 పరుగుల టార్గెట్.. IPL లో అతిపెద్ద చేజ్... కానీ PBKS దానిని అలా ఊది పడేసింది. శ్రేయస్‌ టీమ్  ఓపెనర్లు చుక్కలు చూపిస్తే.. అతను స్వయంగా మిగతా పని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలున్నాయి అతనికి..అందులో ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. శ్రేయస్ అగ్రెషన్ ఏ రేంజ్‌లో ఉందంటే.. తన పదేళ్ల IPL కరీర్‌లో ఎప్పుడూ లేనంత Strike  Rate  ఉంది. 7 మ్యాచ్‌లలో 276 పరుగులు చేసిన అతని స్ట్రైక్‌రేట్ 180కి పైగా ఉంది. 

ప్లేయర్‌ను కాదు.. లీడర్‌ను

అంటే అర్థమవుతోంది కదా.. అతను ప్రతీ మ్యాచ్‌తో ఓ మెసేజ్ ఇస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌ను గెలిపిస్తూ.. తానెంత వాల్యూబుల్ అనేది ప్రూవ్ చేస్తున్నాడు. తాను కేవలం ఆటగాడిని కాదని... ఓ లీడర్‌నని చాటుతున్నాడు. మొదట్లో ఢిల్లీ కేపిటల్స్ కు అడిన శ్రేయస్... ఆ తర్వాత కెప్టెన్ అయి ఆ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు..  తర్వాత... KKR ఆడి దానిని ఫైనల్‌కు చేర్చాడు.. లాస్ట్ ఇయర్‌ PBKSను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.. IPl చరిత్రలోనే చాలా దారుణమైన ట్రాక్ రికార్డ్ ఉన్న  PBKS ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సీజన్‌లో ఆల్‌మోస్ట్ వాళ్లకు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ అయిపోయినట్లే.. మరి ఈ సారి కప్పు అందుకుంటే కనుకు శ్రేయస్‌ను సెలక్టర్లు ఆపగలుగుతారా..?