భారత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఆరు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. భారత మాజీ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మైలు రాయిని మొదట అందుకున్నాడు.


ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇది శిఖర్ ధావన్‌కు 200వ ఐపీఎల్ మ్యాచ్ కూడా కావడం విశేషం. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు శిఖర్ ధావన్ 5,998 పరుగులతో ఉన్నాడు. రెండు పరుగులను దాటగానే శిఖర్ ధావన్ అరుదైన ఆరు వేల పరుగుల మార్కును దాటుకుని విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.


దీంతోపాటు 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కూడా శిఖర్ ధావన్ (88 నాటౌట్: తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ (68) పేరు మీద ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా శిఖర్ ధావన్ అధిగమించాడు.


ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో శిఖర్ ధావన్ (88 నాటౌట్: తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 6.402 పరుగులను సాధించగా... ప్రస్తుతం శిఖర్ ధావన్ పరుగుల వద్ద ఉన్నాడు. రోహిత్ శర్మ (5,764), డేవిడ్ వార్నర్ (5,668), సురేష్ రైనా (5.538)... మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నారు.