SRH vs LSG 2025:అభిషేక్ , ఇషాన్ కిషన్‌ను వరుస బంతుల్లో అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్; కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ చూశారా!

SRH vs LSG 2025: హైదరాబాద్‌లో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఇంటస్ట్రింగ్‌గా సాగుతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లను శార్దూల్ ఠాకూర్ తీసుకున్నాడు.

Continues below advertisement

SRH vs LSG 2025: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో  ఇద్దరు భయంకరమైన బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.  వరుసగా 2 బంతుల్లో ఇద్దర్ని డకౌట్‌కు పంపించి  మ్యాచ్‌లో పై చేయి సాధించాడు. అతను మూడో ఓవర్ మొదటి బంతితో అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. మూడవ స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ను కూాడాా శార్దుల్ తదుపరి బంతితో బోల్తా కొట్టించాడు. 

Continues below advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వ్యతిరేకంగా శార్దుల్ ఠాకూర్ మొదటి ఓవర్ వేశాడు, ఆ ఓవర్‌లో అతను కేవలం 6 పరుగులు ఇచ్చాడు. తొలి ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌కు 5 బంతులు వేశాడు, అందులో ఒక బౌండరీ మాత్రమే వచ్చింది. మొదటి ఓవర్ అద్భుతంగా వేసిన తరువాత అతను మూడో ఓవర్‌లో వరుసగా 2 వికెట్లు తీశాడు.

కావ్య మారన్ ముఖం!

వరుసగా 2 బంతులపై ఇద్దరు  బ్యాట్స్‌మెన్ వికెట్లు పడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ నిరాశ చెందారు. ఆమె ప్రతిచర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో 7వ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.  

బౌలింగ్ చేసిన రిషబ్‌ పంత్‌ వ్యూహం ఫలించింది. వంద పరుగుల లోపే మూడు వికెట్లు తీశారు. మొదటి రెండు వికెట్లను శార్దూల్ ఠాకూర్ తీసుకుంటే... హెడ్ వికెట్‌ను ప్రిన్స్ తీసుకున్నాడు. ఎప్పటి మాదిరిగానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అనుకున్నంత వేగంగా ఎస్‌ఆర్‌హెచ్ ఆడలేకపోయింది. 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11
మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్‌ (కెప్టెన్), సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ

Continues below advertisement