IPL Memes:: ఐపీఎల్ సీజన్ కు సోషల్ మీడియా కూడా రెడీ అయింది. ఎంతగా అంటే.. లక్నో సూపర్ జెయింట్స్ ను అందరూ ఆటపట్టిస్తున్నారు. ఎస్ఆర్ హెచ్ ఈ సీజన్ లో పరుగుల వరద పారిస్తోంది. ఈ క్రమంలో లక్నోను నలిపేస్తారని .. జాలి చూపిస్తున్నారు. లక్నో పరిస్థితిపై వీడియోలతో మీమ్స్ వైరల్ చేస్తూ తెగ నవ్విస్తున్నారు. సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు తాము గ్రౌండ్ లోకి వెళ్లేది లేదని మొరాయిస్తూంటే.. ఆ జట్టు ఓనర్ గోయెంకా లాక్కెళ్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్గా మారింది. గతంలో సారి పది ఓవర్లలోపే లక్నో భారీ స్కోరును చేధించిన విషయాన్ని సన్ రైజర్స్ ఓనర్ అయిన సన్ టీవీ గ్రూపులోని టీవీ జెమిని టీవీ మీమ్ గా రిలీజ్ చేసింది.
చత్రపతి సినిమాలో ఓ సీన్ లో పిల్లల్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని.. తమ ఆటగాళ్లను కాపాడుకునేందుకు చేస్తున్నప్రయత్నం గా మార్చి చేసిన మీమ్ వైరల్ గామారింది. అయినా ఎస్ఆర్‌హెచ్ వదిలి పెట్టదని తీర్మానించారు. [
టాస్ ఎవరు గెల్చినా సరే.. సన్ రైజర్స్ కు మాత్రం ముందు బ్యాటింగ్ ఇవ్వకూడదని కొందరు ఇష్టపూర్వక హెచ్చరికలు జారీ చేశారు.
సన్ రైజర్స్ ఒకప్పుడు టెస్ట్ టీమ్ గా విమర్శలు ఎదుర్కొంది. మెల్లగా పరుగులు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ టీమ్ మారిన వైనం చూసి .. వాట్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటున్నారు.
సన్ రైజర్స్ అంటే అందరూ ఆ టీమ్ ఓవర్ కావ్యను గుర్తు చేసుకుంటారు. ఆమెను ఇన్వాల్వ్ చేయకుండా మీమ్స్ ఉండవు. అలాంటి మీమ్ ఇదొకటి.
సోషల్ మీడియా అంచనాలకు తగ్గట్లుగా హైదరాబాద్ ప్లేయర్స్.. పంత్ టీమ్ ను ఓ ఆటాడిస్తే.. మరోసారి మీమ్స్ తో సోషల్ మీడియా బ్లాకౌట్ అయిపోతుందని అనుకోవచ్చు.