Rohit Sharma 200th IPL Match: హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై స్టార్‌ బ్యాటర్‌ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డు సృష్టించాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌.. హిట్ మ్యాన్‌కు 200వ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో  రోహిత్‌ ముంబై తరఫున  200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ముంబై స్టార్‌ ప్లేయర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు... క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రత్యేక జెర్సీ అందించాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. 239 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉండగా.... 221 మ్యాచ్‌లతో ధోనీ  రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. 2011 నుంచి ముంబైకి ఆడుతున్న హిట్‌మ్యాన్‌.. 5084 పరుగులు చేశాడు. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహితే. 2013 సీజన్‌ మధ్యలో ముంబయి పగ్గాలు అందుకున్న రోహిత్.. జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.


హార్దిక్‌పై అదే స్థాయిలో ట్రోలింగ్‌
ఐపీఎల్‌(IPL)లో గుజరాత్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఫీల్డింగ్‌ స్థానాన్ని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని చెప్పిన హార్దిక్... తర్వాత హిట్‌మ్యాన్‌ను మ‌ళ్లీ లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు. హార్దిక్‌ ఆదేశాలతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రోహిత్ ఫ్యాన్స్.. ఇటు గుజరాత్ టైటాన్స్ అభిమానులు గట్టిగా అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌ ఇక వేరే జట్టుకు వెళ్లిపో అని కొందరు.. హార్దిక్‌కు ముందుంది మొసళ్ల పండగ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్‌కు కోపమొస్తే...
ఇక ముంబ‌య్ ఇండియ‌న్స్ ఆట‌గాడు, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma)గురించి. రికార్డ్ స్థాయిలో త‌మ టీంకు 5 టైటిళ్లు అందించిన రోహిత్ ను కాద‌ని హార్ధిక్‌పాండ్యా(Hardik Pandya )ని ఈ సారి కెప్టెన్ ని చేశారు ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ప‌క్క‌న పెట్ట‌డంతో నెట్టింట్లో మీమ్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. కానీ, ప్రాక్టీస్‌లో అంద‌రితో క‌లిసి పాల్గొన‌డం, హార్ధిక్‌తో మామూలుగానే ఉండటం రోహిత్ మీద ఈ ఎఫెక్ట్ ఏమీలేద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. కానీ మ్యాచ్ లు జ‌రిగే కొద్దీ ఎలా ఉంటుంద‌నేది కొంచెం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పొచ్చు.