Rajasthan Royals vs Punjab Kings: ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ (86 నాటౌట్: 56 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), శిఖర్ ధావన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 9.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. అనంతరం ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి జేసన్ హోల్డర్ రాజస్తాన్‌కు మొదటి వికెట్ అందించాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన భానుక రాజపక్స (1: 1 బంతి) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ (27: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. జితేష్ శర్మ అవుటయ్యాక శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
ధృవ్ జురెల్, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, డోనావన్ ఫెరీరా
మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రిషి ధావన్, అథర్వ టైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మాథ్యూ షార్ట్, మోహిత్ రాథీ
ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం 24 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో రాజస్థాన్ 14 మ్యాచ్‌లు గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అదే సమయంలో ఈ రెండు జట్లూ తలపడ్డ గత ఐదు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ నాలుగు సార్లు విజయం సాధించింది.