RR vs PBKS  Punjab Kings won by 5 wkts:  రాజస్థాన్‌ రాయల్స్‌(RR)కు పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)షాక్ ఇచ్చింది. రాజస్థాన్‌ రాయల్స్ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌... పంజాబ్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులకే పరిమితమైంది. రియాన్‌ పరాగ్‌ 48 పరుగులతో రాణించాడు. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్  5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును సామ్ కరన్ ఒంటి చేత్తో గెలిపించాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 పరుగులు చేసి  కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే  ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రాజస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి

  


రాజస్థాన్ ఇన్నింగ్స్ ఇలా ..


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. మొదటి బంతికి ఫోర్ బాదిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతిని వికెట్ల మీదికి ఆడుకుని అవుట్‌ అయ్యాడు. జైస్వాల్‌ మంచి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి వికెట్లకు తగిలింది. దీంతో తొమ్మిది పరుగులకే రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత సంజు శాంసన్, టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ కాసేపు పంజాబ్‌ బౌలర్లను ప్రతిఘటించారు. కానీ పరుగులు మాత్రం రాలేదు. పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ స్కోరు 38/1. ఆ తర్వాత కాసేపటికే 18 పరుగులు చేసిన శాంసన్ అవుటయ్యాడు. దీంతో 40 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్ కోల్పోయింది.తరువాత టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ చాహర్ ఓవర్‌లో భారీ షాట్ ఆడి కాడ్‌మోర్ లాంగాన్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. మొత్తానికి 10 ఓవర్లకు రాజస్థాన్‌ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌కు అశ్విన్ ఊపు తెచ్చాడు.  రాహుల్ చాహర్ వేసిన 12 ఓవర్‌లో అశ్విన్ వరుసగా 6, 4, 4 బాదాడు. కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన 13 ఓవర్‌లో చివరి బంతికి 28 పరుగులు చేసి అశ్విన్ అవుటయ్యాడు. దీంతో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో రాజస్థాన్‌కు గట్టి షాక్‌ తగిలింది.


శామ్‌ కరన్ వేసిన 14 ఓవర్‌లో మూడో బంతికి ధ్రువ్ జురెల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మొత్తానికి  పంజాబ్ బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కానీ రియాన్‌ పరాగ్‌ పోరాడాడు. రాజస్థాన్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా పరాగ్‌ చివరి వరకూ నిలిచాడు కానీ హాఫ్ సెంచరీ అవ్వకుండానే అవుటైపోయాడు. రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 2, రాహుల్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎలిస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  దీంతో ఐపీఎల్ 17 సీజన్‌ ప్రయాణాన్ని పంజాబ్ విజయంతో ముగించినట్టు అయ్యింది.