Rohit Sharma Celebrates Yashasvi Jaiswal Century : సాధారణంగా సెంచరీ చేస్తే టీమ్ మేట్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నిన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సంగతి వేరే. యశస్వి జైశ్వాల్ సెంచరీ కొట్టేసి ముంబై ఇండియన్స్ పై మ్యాచ్ గెలిస్తే...ఆ ముంబైకి మాజీ కెప్టెన్ అండ్ లెజెండరీ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ..జైశ్వాల్ సెంచరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ తర్వాత విన్నింగ్ షాట్ కొట్టి రాజస్థాన్ ను యశస్వి గెలిపించిన తర్వాత రోహిత్ శర్మ దగ్గరకు సంతోషంగా వెళ్లి హగ్ చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఫెయిల్యూర్ కి ఇక గుడ్ బై చెప్పేసినట్లు వాళ్లిద్దరూ చాలా సంతోషంగా కనిపించిన ఫోటోస్, యశస్వి రోహిత్ బాండింగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్‌తో బిజీగా ఉన్నా రోహిత్ శర్మ ఫోకస్ మొత్తం రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ భారం లేకపోవడంతో బుర్ర అంతా టీ20 వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాడు. టీమ్‌లోకి ఎవర్ని తీసుకోవాలి, టీమ్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోతే.. వారిని ఎలా ముందుకు నడిపించాలి అనేవే ప్రస్తుతం రోహిత్ మైండ్‌లో మెదులుతున్నాయి.ఇక యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే ఐపీఎల్ కి ముందు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్.. ఐపీఎల్ లో ఇప్పటి వరకు అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ముంబైతో మ్యాచ్ లో సెంచరీ కొట్టేంత వరకూ ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనూ యాభైపరుగులు చేయలేకపోయాడు. టీ20వరల్డ్ కప్ కి ముందు జైశ్వాల్ ఇలా నిరుత్సాహ పడిపోవటం బహుశా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచిగా అనిపించలేదేమో. మ్యాచ్ కి ముందు జైశ్వాల్ ను తన దగ్గరకు పిలిపించుకుని ఏదో మాట్లాడాడు. చాలా సేపు వాళ్లిద్దరూ ఒంటరిగా మాట్లాడుకున్నారు.
ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా బ్యాటింగ్ చేయాలని, ఐపీఎల్ ప్రదర్శన టీమిండియాలో నీ చోటు డిసైడ్ చేయలేదని, ఫ్రీగా ఆడాలని రోహిత్ జైస్వాల్‌తో చెప్పినట్లు సమాచారం. కెప్టెన్ ఇచ్చిన భరోసాతో జైస్వాల్ మైండ్ అంతా రిలాక్స్ అయిపోయి.. తనలోని సహజమైన ఎటాకింగ్ ప్లేతో సెంచరీ సాధించాడు. అందుకే దటీజ్ రోహిత్ శర్మ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యశస్వి హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ అభినందించటం కనిపించింది.
టచ్‌లోకి వస్తే ఆపలేం...
ముంబై ఇండియన్స్ పై నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేయాల్సిన 180పరుగుల లక్ష్య చేధనను తన బ్యాటింగ్ తో చాలా ఈజీ చేసేశాడు. ఓపెనర్ బట్లర్, వన్ డౌన్ బ్యాటర్ కెప్టెన్ శాంసన్ తోడుగా ఆడుతూ 60 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 104పరుగులు బాదేశాడు. ఈ సీజన్ లో ఒక్కసారి హాఫ్ సెంచరీ చేయని జైశ్వాల్ ఈసారి ఎలాగైనా సెంచరీ కొట్టి తీరాలన్న కసి ముంబైపై మ్యాచ్ లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ముంబై బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సూపర్ సెంచరీ కొట్టేసిన జైశ్వాల్ శతకం పూర్తవగానే గాల్లోకి ఎగిరి తనదైన స్టైల్ లో సింహనాదం చేశాడు. ఈ సెంచరీ ద్వారా తనూ వరల్డ్ కప్ రేసులో ఉన్నాననే వార్నింగ్ ను సెలెక్టర్లకు పంపించాడు.