RR vs DC IPL 2024 Rajasthan Royals wins by 12 runs: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ (RR)వరుసగా రెండో విజయం సాధించింది. డిల్లీ(DC)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. జైపూర్ వేదికగా మ్యాచ్ ఈ సీజన్ లో మరో ఉత్కంఠ పోరుగా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకు అభిమానులను కట్టి పడేసింది. ఈసారి కూడా విజేత సొంత మైదానంలో ఆడిన జట్టే. 186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢీల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ , స్టబ్స్ చెలరేగి ఆడినప్పటికీ మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు.
ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో ఆరంభంలో రాజస్థాన్ స్కోరు బోర్డు అసలు ముందుకే కదలలేదు. కానీ పది ఓవర్ల తర్వాత కాస్త పుంజుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 84 పరుగులతో రాణించడంతో 185 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 29 పరుగులతో రాణించాడు. పరాగ్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.
పరాగ్ ఒక్కడే...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ..రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే రాజస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. జట్టు స్కోరు తొమ్మిది పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అవుటయ్యాడు. ఏడు బంతుల్లో అయిదు పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను.... ముకేష్ కుమార్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కానీ ఖలీల్ అహ్మద్ సంజు శాంసన్‌ను అవుట్ చేసి రాజస్థాన్‌కు మరో షాక్ ఇచ్చాడు. 14 బంతుల్లో 15 పరుగులు చేసిన శాంసన్... పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే జోస్ బట్లర్ కూడా 16 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్ ఏడు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట దశలో రియాన్ పరాగ్.. రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ రాజస్థాన్ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. కానీ ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. 19 బంతుల్లో మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అశ్విన్.. అవుటయ్యాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ పోరాడడంతో రాజస్థాన్ పోరాడే లక్ష్యాన్ని.... ఢిల్లీ ముందు ఉంచింది. పరాగ్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌కుమార్ 1, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1, కుల్‌దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
రాజస్థాన్ నిర్దేశించిన 186 పరుగుల ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కినా ఆ తర్వాత తడబడింది. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.అక్కడి నుంచి కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్ లు ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే అ 122 పరుగులకే ఐదు వికెట్లు పడిన ఢిల్లీ ఓటమి అంచున నిలిచింది. ఆసమయంలో స్టబ్స్( సిక్సర్ల మోతతో ఆశలు రేపాడు. 19వ ఓవర్లో స్టబ్స్ తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి అక్షర్ పటేల్ రెండు రన్స్ తీశాడు. దాంతో, ఆఖరి ఓవర్లో 17 రన్స్ అవసరమయ్యాయి. కానీ అవేశ్ ఖాన్.. కేవలం నాలుగు రన్స్ ఇవ్వడంతో ఢిల్లీకి రెండో ఓటమి తప్పలేదు.