Rohit Sharma becomes 2nd player after MS Dhoni to play 250 matches in IPL: టీమిండియా(Team India) సారధి, ముంబై స్టార్‌ బ్యాటర్‌ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌(IPL)లో 250 మ్యాచుల మైలురాయిని పూర్తి చేసుకోవడమే కాక..  ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ... 25 బంతుల్లో 2 ఫోర్లు మూడు సిక్సర్లతో 36 పరుగులు చేసి శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 6500 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 250 మ్యాచుల్లో రోహిత్‌ శర్మ 6, 508 పరుగులు చేశాడు. 


ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 7,624 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా...6,729 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్‌ వార్నర్‌ 6,563 పరుగులతో మూడో స్థానంలో ఉండగా... 6, 508 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

 

ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా కోహ్లీ-రోహిత్‌

అమెరికా-వెస్టిండీస్ నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్‌, విరాట్ కోహ్లీను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న దానిపై సెలక్షన్‌ కమిటీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. టీ20ల్లో ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మ‌న్ గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఆడించాలని ఆగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌-కోహ్లీలను ఓపెనర్లుగా బరిలోకి దించే  సాహసోపేతమైన నిర్ణయాన్ని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.ఇప్పటికే ఐపీఎల్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ  పరుగుల వరద పారిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లీ ఇప్పటికే ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 361 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓపెనర్‌గా కేవలం తొమ్మిది మ్యాచ్‌లు అడిన కోహ్లి 57 సగటుతో 400 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా 138కి పైనే ఉంది. ఈ అంశాలను సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తోంది. మరోవైపు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సృష్టించిన విధ్వంసం, నెలకొల్పిన రికార్డులు క్రికెట్‌ అభిమానులకు తెలుసు. వీటన్నింటీని పరిశీలనలోకి తీసుకున్న సెలక్షన్‌ కమిటీ వీరిద్దరిని ఓపెనర్లుగా బరిలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

 

హార్దిక్‌ కష్టమే

ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా, బ్యాటర్‌గా కూడా దారుణంగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాకు టీ 20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో బౌలర్‌గా సత్తా చాటితేనే హార్దిక్‌ పేరును టీ20 ప్రపంచకప్‌కు పరిగణించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇచ్చే విషయంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న రియాగ్‌... టీ 20 ప్రపంచకప్‌ జట్టులో ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. రియాగ్‌ ఈ ఐపీఎల్‌లో ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.