Big Players Flop in IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎక్కువగా ఖరీదైన ఆటగాళ్ళు నిరాశపరిచారు. IPL 2025లో కూడా ఇదే జరుగుతోంది, రషభ్‌ పంత్ సహా చాలా మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు భారీగా ధర పెట్టి కొనుగోలు చేసింది. కానీ వారంతా ఘోరంగా విఫలమయ్యారు.  పంత్ ఇప్పటివరకు 10 మ్యాచ్ లలో ఒక అర్ధ శతకం  మాత్రమే చేశాడు, అదే సమయంలో వెంకటేష్ అయ్యర్ గణాంకాలు కూడా అతనిపై 23.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తప్పు అని నిరూపిస్తున్నాయి. వారితోపాటు మరికొంత మంది పెద్ద ఆటగాళ్ళు విఫలమయ్యారు, వారి మొత్తం ఖరీదు  100 కోట్ల రూపాయలకుపైగా ఉంది.

IPL 2025 అతిపెద్ద వైఫల్యం!

విఫలమైన ఆటగాళ్ల జాబితాలో మొదటి పేరు  రిషభ్ పంత్, ఆయనను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. పంత్ వ్యక్తిగత ప్రదర్శన అంచనాలకు భిన్నంగా ఉంది, 10 మ్యాచ్ లలో అతని బ్యాట్ నుంచి కేవలం 110 పరుగులు మాత్రమే వచ్చాయి. పంత్ పరిస్థితి అంత దారుణంగా ఉంది, IPL 2025 లో అతని సగటు కేవలం 12.22 మాత్రమే. రెండో పేరు వెంకటేష్ అయ్యర్, KKR 23.75 కోట్ల రూపాయలకు ఇతన్ని కొనుగోలు చేసింది. అయ్యర్ ఈ సీజన్ లో బౌలింగ్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు, అదే సమయంలో బ్యాటింగ్ లో 20.29 అనే చెత్త సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు.

'ఫినిషర్'గా పేరు పొందిన రింకు సింగ్ కూడా KKR కు ఏమీ ప్రత్యేకంగా చేయలేకపోయాడు. అతను 10 మ్యాచ్ లలో కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు.  చాలా సందర్భాలలో KKR కు మ్యాచ్ ఫినిష్ చేయడంలో విఫలమయ్యాడు. IPL 2025లో అతనికి 13 కోట్లకు వేలాంలో దక్కించుకుంది. ఆండ్రే రస్సెల్ 12 కోట్ల రూపాయల  తీసుకొని  అనుభవం లేని ఆటగాడిలా ప్రదర్శన ఇస్తున్నాడు. అతను ఇప్పటివరకు బ్యాట్ తో కేవలం 72 పరుగులు చేసి  బౌలింగ్ లో కేవలం 8 వికెట్లు తీశాడు.

RCB , CSK కు కూడా తీవ్ర నష్టం

RCB పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్నప్పిటికీ కొందరు ఆటగాళ్ల పెర్ఫామెన్స్‌ చాలా దారుణంగా ఉంది. లియాం లివింగ్ స్టన్, అతని స్థాయికి తగ్గట్టు ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. 8.75 కోట్ల రూపాయల పలికిన  లివింగ్ స్టన్ ప్రస్తుత సీజన్ లో 87 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సీజన్‌లో మాత్రం RCB అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను వణిగిస్తోంది. 

CSK రవీంద్ర జడేజాను 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది, కానీ అతనికి ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ జడేజా తన జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకోలేకపోయాడు.  బ్యాటింగ్‌లో మెరుస్తున్నా బౌలింగ్‌లో మ్యాజిక్ చేయలేకపోయాడు. IPL 2025 లో అతను కేవలం 7 వికెట్లు తీశాడు . ఇప్పటివరకు బ్యాటింగ్ లో 260 పరుగులు చేశాడు. అదే సమయంలో మహమ్మద్ షమీని SRH 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది, అతను ఇప్పటివరకు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇప్పుడు చెప్పుకున్న ఆటగాళ్లను మొత్తం 100 కోట్లకుపైగా చెల్లిస్తున్నారు. వారి ప్రదర్శన మాత్రం ఆస్థాయిలో లేదు.