Kohli Unbeaten Fifty Vs KKR: ఐపీఎల్ 2025 ఫ‌స్ట్ మ్యాచ్ లోనూ ఆర్సీబీ బోణీ కొట్టింది. శనివారం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 174 ప‌రుగ‌లు చేసింది. అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ (56) తో రాణించాడు. క్రునాల్ పాండ్యా మూడు వికెట్లతో స‌త్తా చాటాడు. అనంత‌రం ఆర్సీబీ ఛేజింగ్ ను 16.2 ఓవ‌ర్ల‌లోనే మూడు వికెట్ల‌కు 177 ప‌రుగులు పూర్తి చేసి విజ‌యం సాధించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అజేయ ఫిఫ్టీ చేసి జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించాడు. ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఫిఫ్టీతో సత్తా చాటాడు.  బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ (1-27) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ విజ‌యంతో ఆడిన తొలి మ్యాచ్ లోనూ ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఇక డిఫెండింగ్ చాంపియ‌న్స్ గా బ‌రిలోకి దిగిన కేకేఆర్ కు భారీ షాక్ త‌గిలింది.






అదిరే శుభారంభం.. 
ఓ మోస్తార్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి అదిరే శుభారంభం ద‌క్కింది. ముఖ్యంగా ఓపెన‌ర్లు సాల్ట్, కోహ్లీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కేకేఆర్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని, ప‌రుగులు సాధించారు. ముఖ్యంగా సాల్ట్, చాలా దూకుడుగా ఆడాడు. అలాగే కోహ్లీ కూడా వీలైనంత వేగంగా ఆడేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో 80 ప‌రుగుల‌తో టార్గెట్ లో దాదాపుగా స‌గం ప‌రుగులు సాధించింది. ఇక దూకుడు మీదున్న సాల్ట్ సెంచ‌రీ చేస్తాడ‌ని అనిపించింది. అయితే చివ‌రికి మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చేతికి చిక్కాడు. బంతిని కాస్త దూరంగా గూగ్లీ వేయ‌గా, భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి, స్పెన్స‌ర్ జాన్స‌న్ ప‌ట్టిన క్యాచ్ కు సాల్ట్ పెవిలియ‌న్ కు చేరాడు.


గేర్ మార్చిన కోహ్లీ.. 
అప్ప‌టివ‌ర‌కు దూకుడుగా ఆడిన కోహ్లీ, సాల్ట్ వికెట్ ప‌డ్డాక కాస్త సంయ‌మ‌నంతో ఆడ‌డు. దేవ‌ద‌త్‌ ప‌డిక్క‌ల్ (10), పాటిదార్ (34) ల‌తో చ‌ర్చిస్తూ, ఇన్నింగ్స్ ముందుకు న‌డిపించాడు. ఎలాగైనా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌ను బ్యాటింగ్ చేసిన‌ట్లు క‌నిపించింది. అయితే భారీ షాట్ల‌కు ప్ర‌య‌త్నించి, వీరిద్ద‌రూ ఔటైనా, లియామ్ లివింగ్ స్ట‌న్ (15 నాటౌట్) తో క‌లిసి కోహ్లీ జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. మిగ‌తా బౌల‌ర్ల‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి త‌లో వికెట్ ద‌క్కింది. మూడు వికెట్ల‌తో మ్యాచ్ ను మ‌లుపు తిప్పిన క్రునాల్ పాండ్యాకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.