RCB vs LSG IPL 2024 Match Preview : వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం తర్వాత బెంగళూరు(RCB) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో అమీతుమీ తేల్చుకోనుంది. విరాట్ కోహ్లీ(Kohli) ఒక్కడే స్థిరంగా రాణిస్తుండడం మినహా మిగిలిన విభాగాల్లో తేలిపోతున్న బెంగళూరు.. ఈ మ్యాచ్‌లో అన్ని సమస్యలను పరిష్కరించుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్న వేళ... అతను బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ ప్రస్తుతం మూడు మ్యాచుల్లో ఒకే విజయంతో  రెండు పాయింట్లు సాధించి  పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత బెంగళూరు నెట్‌ రన్‌రేట్‌ భారీగా పడిపోయింది. 

 

బ్యాటింగ్‌ కష్టాలు తీరుతాయా..?

బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేసేందుకు కష్టపడుతున్నాడు, RCB బ్యాటింగ్ లైనప్‌ పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్నా  మైదానంలో కోహ్లీ ఒక్కడే పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో స్థిరంగా రాణిస్తున్నాడు. డు ప్లెసిస్, రజత్‌ పాటిదార్‌,  గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దారుణంగా విఫలమవుతున్నారు. కానీ దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్‌లు రాణిస్తుండడంతో లోయర్‌ ఆర్డర్‌ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఈ మ్యాచ్‌లో రజత్‌ పాటిదార్‌కు విశ్రాంతి ఇచ్చి సుయాష్ ప్రభుదేశాయ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. బెంగళూరు జట్టులో సీనియర్ బ్యాటర్ల వైఫల్యం... సీనియర్ల బౌలర్లకు పాకాయి. మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమతున్నాడు. బెంగళూరు జట్టులో లీడ్ పేసర్ అయిన సిరాజ్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, సిరాజ్‌ ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. IPL 2023 సమయంలో  స్థిరంగా రాణించిన సిరాజ్‌... ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 

 

లక్నో గాడిన పడుతుందా..?

రెగ్యులర్ కెప్టెన్ రాహుల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు కొనసాగుతున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. నూతన కెప్టెన్ నికోలస్ పూరన్‌ ఈ మ్యాచ్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. లక్నో... కె.ఎల్‌. రాహుల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగిస్తుందా అన్నది చూడాలి. లేక ఈ మ్యాచ్‌లో కెప్టెన్, బ్యాటర్, వికెట్ కీపర్‌గా రాహుల్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాడా అన్నది చూడాలి. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శన లక్నోకు ఆనందాన్నిస్తుంది. 

 

జట్లు 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భండగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. 

 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.