Royal Challengers Bangalore vs Gujarat Titans: ఐపీఎల్‌ 2023 సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. అలాంటి కీలక మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (101 నాటౌట్: 61 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుతమైన సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తమ టాప్ ప్లేస్‌ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకుంది. కాబట్టి వారు ఈ మ్యాచ్‌లో ఒత్తిడి లేకుండా ఆడవచ్చు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పటిలానే ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్ (28: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు), విరాట్ కోహ్లీ బెంగళూరు అద్భుతమైన ఆరంభం అందించారు. మొదటి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (11: 5 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వచ్చీ రాగానే బౌండరీ, సిక్సర్‌తో చెలరేగినా తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. మహీపాల్ లొమ్రోర్ (1: 3 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. దీంతో బెంగళూరు 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్ (26: 16 బంతుల్లో, ఐదు బంతుల్లో) ఆర్సీబీని ఆదుకున్నారు. స్కోరు వేగం తగ్గకుండా బౌండరీలు కొట్టారు. ముఖ్యంగా కోహ్లీ చాలా ప్లానింగ్‌తో ఆడాడు. బంతిని ఎక్కువ గాల్లోకి కొట్టకుండా వీలైనంత వరకు గ్రౌండెడ్‌గా ఆడాడు. ఈ దశలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం మైకేల్ బ్రేస్‌వెల్‌ను షమీ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. దినేష్ కార్తీక్  (0: 1 బంతి) కూడా వెంటనే అవుటయ్యాడు. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది.


అనంతరం విరాట్ కోహ్లీకి అనుజ్ రావత్ (23 నాటౌట్: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) తోడయ్యాడు. అనుజ్ రావత్ స్ట్రైక్ రొటేట్ చేయగా, విరాట్ కోహ్లీ స్ట్రైకింగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విరాట్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత అనుజ్ రావత్ సిక్సర్, ఫోర్ కొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేశాయ్, హిమాంశు శర్మ, సోను యాదవ్, ఆకాష్ దీప్


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
విజయ్ శంకర్, శ్రీకర్ భరత్, శివం మావి, సాయి కిషోర్, అభినవ్ మనోహర్