Royal Challengers Bangalore vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మొదట బ్యాటింగ్ చేయనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లేఆఫ్స్‌కి చేరుకోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా ముఖ్యం. గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకుంది. కాబట్టి వారు ఈ మ్యాచ్‌లో ప్రశాంతంగా ఆడుకోవచ్చు. కానీ టాస్ వేశాక మళ్లీ వర్షం పడుతుంది కాబట్టి మ్యాచ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలోనూ ఉన్నాయి. టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేదు. కాబట్టి జస్ట్ గెలిస్తే సరిపోతుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మొదటి స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కాబట్టి గెలిచినా ఓడినా వారికి పోయేదేమీ లేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేశాయ్, హిమాంశు శర్మ, సోను యాదవ్, ఆకాష్ దీప్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
విజయ్ శంకర్, శ్రీకర్ భరత్, శివం మావి, సాయి కిషోర్, అభినవ్ మనోహర్
ఆర్సీబీకి బ్యాటింగే బలం. కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. అదే సమయంలో వీరు విఫలమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. సొంత గ్రౌండ్ లో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే అయినా గుజరాత్ బౌలింగ్ దాడిని డుప్లెసిస్ గ్యాంగ్ ఎలా ఎదుర్కుంటుదనేది ఆసక్తికరం. వరుసగా రెండో సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ఉపయోగం లేదు. కానీ క్వాలిఫైయర్ -1 కు ముందు గెలిచిన ఉత్సాహంతో ఉండాలని హార్ధిక్ సేన భావిస్తున్నది.