Royal Challengers Bangalore vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్ 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్‌కు దిగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
పృథ్వీ షా, ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, చేతన్ సకారియా
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ ప్రభుదేసాయి, డేవిడ్ విల్లీ, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడిట్లో విజయం సాధించింది. ఒకటి ఓడిపోయింది. సంజూ శాంసన్ జట్టు ఆరు పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్‌తో నంబర్ వన్ స్థానంలో ఉంది.
లక్నో సూపర్ జెయింట్ కూడా 4 మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. దీంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ అవే నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిదో స్థానానికి, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కాగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది.