Royal Challengers Bangalore vs Chennai Super Kings: ఐపీఎల్ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (83: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివం దూబే (52: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరంభంలోనే చెన్నైకి ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను (3: 6 బంతుల్లో) మహ్మద్ సిరాజ్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టించాడు. కానీ మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (83: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ అజింక్య రహానే (37: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెన్నై ఇన్నింగ్స్‌ను పరుగులెత్తించారు. వీరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో రహానేను క్లీన్ బౌల్డ్ చేసి వనిందు హసరంగ బెంగళూరుకు రెండో వికెట్ అందించాడు.
ఆ తర్వాత డెవాన్ కాన్వేకు శివం దూబే (52: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) తోడయ్యాడు. ఈ జోడి విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం విశేషం. బెంగళూరు బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 37 బంతుల్లోనే మూడో వికెట్‌కు వీరు 90 పరుగులు జోడించారు. ఈ దశలో డెవాన్ కాన్వే, శివం దూబే వెంట వెంటనే అవుట్ అయ్యాక చెన్నై వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. కానీ వచ్చిన వారంతా వేగంగా ఆడటంతో స్కోరు వేగం మాత్రం తగ్గలేదు. చివరి ఓవర్‌ను హర్షల్ పటేల్ ప్రారంభించాడు. కానీ రెండు బీమర్లు వేయడంతో బౌలింగ్‌ను మ్యాక్స్‌వెల్‌కు అప్పగించారు. ఈ ఓవర్లో కూడా 16 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హర్షల్ పటేల్, వనిందు హసరంగ, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, ఆకాష్‌దీప్, కరణ్ శర్మ, అనూజ్ రావత్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆకాష్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్, సుభ్రాంషు సేనాపతి, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్