Chinnaswmi Stampede Latest Update: బెంగళూరు చిన్నస్వామి తొక్కిసలాట కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి కర్ణాటక హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్సీబీ మేనేజర్‌కు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన తీర్పును బుధవారం (జూన్ 11వ తేదీకి) రిజర్వ్ చేసింది. చిన్నస్వామి తొక్కిసలాట ఘటనపై తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది. 

కర్ణాటక హైకోర్టు మంగళవారం నాడు (జూన్ 10న) RCB మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోస్లేకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. జూన్ 11 వరకు రిజర్వ్ చేయాలని కోర్టు సూచించింది. జూన్ 6న పోలీసులు సోస్లేను అరెస్టు చేశారని తెలిసిందే

RCB మేనేజర్‌కు బెయిల్ నిరాకరణ

ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోస్లే తనను అరెస్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆర్సీబీ మేనేజర్ సోస్టేకు కోర్టులో ఊరట దక్కలేదు. ఇప్పుడు ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది. సోస్లే తన అరెస్టు చట్టవిరుద్ధమని మద్యంతర బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ ఆదేశాల ద్వారా పోలీసులు ప్రభావితమై అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు సోస్లేకు బెయిల్ నిరాకరించింది.

RCB ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో అది వారికి తొలి ఐపీఎల్ ట్రోఫీ. మరుసటి రోజు (జూన్ 4న) విన్నింగ్ సెలబ్రేషన్ చేయాలని ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది.  దాంతో ట్రోఫీని చూడటానికి, ఆర్సీబీ జట్టు విక్టరీ వేడుకలో భాగం కావాలనుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వద్దకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో స్టేడియం వ్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలలో భాగంగా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. 

కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారం పెంచింది

తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే నష్టపరిహారం పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందజేస్తుంది. ఫ్రాంచైజీ RCB కూడా మరణించిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రకటించింది.

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో బయటపడుతున్న సంచలన విషయాలు ఆర్సీబీ విజయోత్సవ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదే తేల్చి చెప్పిన కర్ణాటక రాజ్ భవన్.మొదట ఆర్సీబీ ఆటగాళ్లను రాజ్ భవన్‌లో సన్మానించాలని గవర్నర్ నిర్ణయించినట్టు తెలిపిన రాజ్ భవన్ సిబ్బంది అయితే సన్మాన సభ విధాన సౌధలో జరుగుతుందని, గవర్నర్‌ను సీఎం స్వయంగా ఆహ్వానించారని తెలిపిన రాజ్ భవన్ సిబ్బంది దీంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు నిజం కాదంటున్న బీజేపీ