3 Players will be out from Rcb: 17 ఏళ్ల పోరాటం త‌ర్వాత‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఈ ఏడాది విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. మూడుసార్లు ఫైన‌ల్స్ కు వెళ్లి ర‌న్న‌ర‌ప్ తోనే స‌రిపెట్టుకున్న ఆర్సీబీ.. నాలుగోసారి మాత్రం ఫైన‌ల్ హార్డిల్స్ ను దాటింది. కొత్త కెప్టెన్ రజత్ పతిదార్ తొలిసారి జట్టుకు టైటిల్ రుచి చూపించి, ఎన్నో ఏళ్ల కరువును తీర్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.  అయితే ఈ ఏడాది డిసెంబ‌ర్ లో జ‌రిగే వేలానికి ముందు జ‌ట్టులోని ముగ్గురు ఆట‌గాళ్ల‌ను రిలీజ్ చేసే అవ‌కాశ‌ముంది. ఈసారి జ‌ట్టు అనుభ‌వ‌జ్ఞులు, యువ‌కుల‌తో కూడి ఉండి సూప‌ర్బ్ గా క‌నిపిస్తోంది. అయినా కూడా కొంత‌మంది ఆట‌గాళ్ల‌ను నిరూపించుకోలేక పోయారు. వాళ్ల‌కు జ‌ట్టు నుంచి ఉద్వాసన క‌ల‌గ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. రాబోయే వేలానికి ప‌ర్స్ అమౌంట్ ను స‌మ‌కూర్చుకోవ‌డం కోసం ఆర్సీబీ ఈ చర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఆర్సీబీ నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యే ముగ్గురు ఆట‌గాళ్లు ఎవరంటే..?

Continues below advertisement

మ‌యాంక్ అగ‌ర్వాల్..2011 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న మయాంక్.. ఇప్ప‌టివ‌ర‌కు రెండు సీజ‌న్ల‌లో ఆడాడు. 2700ల‌కు పైగా ప‌రుగుల‌ను సాధించాడు. అయితే గ‌తేడాది నాలుగు మ్యాచ్ ల్లో అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికీ కేవ‌లం 96 పరుగుల‌ను మాత్ర‌మే చేశాడు. వెటరన్ ఆటగాడు కావడం, యువకులతో పోటీ తీవ్రంగా ఉండటంతో మయాంక్ ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశముంది. అంతకుముందు ఏడాది తను సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడినా విఫలమయ్యాడు.  దీంతో ఈసారి అత‌నికి జ‌ట్టు నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌క పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. 

ర‌సిఖ్ స‌లామ్ దార్..2024 సీజ‌న్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ర‌సిఖ్.. ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సీజ‌న్లో కేవ‌లం 6 ఓవ‌ర్లు వేసినప్ప‌టికీ ఒక్క వికెట్ కూడా తీయ‌లేక పోయాడు. బ్యాటింగ్ లోనూ అత‌ని ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో ఈ అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ ను వేలానికి ముందుగా రిలీజ్ చేయ‌వ‌చ్చు. అయితే ఆల్ రౌండ్ నైపుణ్యాలు ఉండటం, యువకుడు అవడంతోె తనను వేరే ఫ్రాంచైజీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

Continues below advertisement

లియామ్ లివింగ్ స్ట‌న్..స్పిన్ బౌలింగ్, విధ్వంస‌క బ్యాటింగ్ తో అల‌రించే లియామ్.. త‌మ జ‌ట్టులో ఉండాల‌ని అన్ని జ‌ట్లు కోరుకుంటాయి.  అయితే ఈ సీజ‌న్ లో త‌న ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా ఉంది. అంచనాల‌కు త‌గిన‌ట్లుగా రాణించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ప‌ది మ్యాచ్ లు ఆడిన త‌ను కేవ‌లం 112 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 133 ఉంంది. ఈ క్ర‌మంలో త‌న‌కు కూడా ఎగ్జిట్ డోర్ ను ఫ్రాంచైజీ చూపించే అవ‌కాశ‌ముంది.  అయితే ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని లివింగ్ స్టన్.. వేలానికి ముందు మిగతా టోర్నీల్లో సత్తా చాటి, ఫామ్ లోకి వస్తే తనను రిటైన్ చేసే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం. ఏదేమైనా వేలానికి దాదాపు రెండు నెలలు గడువు ఉండటంతో ఈ లోపు ఫ్రాంచైజీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.