Ravichandran Ashwin Picks Best Playing 11 Of IPL: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకునేలా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ సీజన్ కు సంబంధించిన బెస్ట్ ప్లేయింగ్ 12 టీమ్ ను సెలెక్ట్ చేశాడు. ఈ లిస్టులో ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను తన టీమ్ కు కెప్టెన్ గా అనౌన్స్ చేశాడు. ఈ సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP) అవార్డు విన్నర్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ఫస్ట్ ఓపెనర్ గా ఎంచుకున్నాడు. వైభవ్ ఈ టోర్నమెంట్ లో 16 మ్యాచుల్లో 237 కి పైగా స్ట్రైక్ రేట్ తో 776 రన్స్ చేసి హయ్యెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు.
Read Also: Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
గిల్ తో కలిసి ఓపెనింగ్..
అశ్విన్ టీమ్ లో సెకండ్ ఓపెనర్ గా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ ఈ సీజన్ లో 46 యావరేజ్, 163.02 స్ట్రైక్ రేట్ తో 732 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లెజెండ్ విరాట్ కోహ్లీని నంబర్ 3 పొజిషన్ కు పరిమితం చేశాడు. కోహ్లీ ఈ టోర్నీ అంతటా ఓపెనర్ గా ఆడినప్పటికీ అశ్విన్ మాత్రం అతడిని వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దించాడు. విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో 56.25 అద్భుతమైన యావరేజ్ తో 675 రన్స్ చేసి తన క్లాస్ పర్ఫార్మెన్స్ ను చూపించాడు.
మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్, పాటిదార్..
నంబర్ 4 ప్లేస్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ను సెలెక్ట్ చేశాడు. క్లాసెన్ ఈ సీజన్ లో 48 యావరేజ్ తో 624 రన్స్ చేశాడు. నంబర్ 5 లో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ను ఎంచుకున్నాడు. పాటిదార్ 192.69 స్ట్రైక్ రేట్ తో 500 కి పైగా రన్స్ తో విధ్వంసం సృష్టించాడు. నంబర్ 6 ను ఎస్ఆర్‌హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కేటాయించాడు. నితీష్ 14 మ్యాచుల్లో 300 రన్స్ తో పాటు 8 వికెట్లు తీసి టీమ్ కు మంచి బ్యాలెన్స్ ఇచ్చాడు. నంబర్ 7 లో ఆర్‌సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాని ఎంపిక చేశాడు. కృనాల్ 16 మ్యాచుల్లో 226 రన్స్ తో పాటు 14 వికెట్లు పడగొట్టాడు.
ఓవర్సీస్ స్టార్లతో బౌలింగ్ లైన్ అప్..
బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కోసం అశ్విన్ ముగ్గురు ఫారెన్ ప్లేయర్లను లైన్ లోకి తెచ్చాడు. సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ (14 వికెట్లు), కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (15 వికెట్లు, 6.64 ఎకానమీ) లతో పాటు ఈ సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ కాగిసో రబాడ (29 వికెట్లు) ను మెయిన్ పేసర్ గా తీసుకున్నాడు. వీరితో పాటు ఆర్‌సీబీ స్పియర్ హెడ్ భువనేశ్వర్ కుమార్ ను ఎంచుకున్నాడు. భువి 16 మ్యాచుల్లో 7.95 ఎకానమీతో 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా రాజస్థాన్ రాయల్స్ (RR) స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు) ను ఎంపిక చేసినట్లు అశ్విన్ స్పష్టం చేశాడు.
